Sujeeth is all set for Pawan Kalyan's OG movie teaser
Pawan Kalyan – OG : ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి మన స్టార్ హీరోల సినిమాలు మొత్తం పాన్ ఇండియా లో భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం హీరోగా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓ జి సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే తెరకెక్కుతుంది. ఇక దానికి సంబంధించిన ప్రణాళికలో భాగంగానే ఇందులో విలన్ గా ఇమ్రాన్ హష్మి ని కూడా తీసుకున్నారు.
మార్కెట్ పరంగా కూడా ఈ సినిమా బాలీవుడ్ లో వర్కౌట్ కావాలనే ఉద్దేశంతోనే ఆయనను ఈ సినిమాలో తీసుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీ వరకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా 40% వరకు బ్యాలెన్స్ ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ బిజీ లో తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన ఫ్రీ అవ్వడానికి మరో రెండు నెలలు పడుతుంది. మిగతా రెండు నెలల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఎన్ని డేట్లు కేటాయిస్తాడు ఎలా షూట్ జరుగుతుందనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి ని అయితే నెలకొల్పుతుంది. అందుకే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఈ విషయాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఈ సినిమా కనక ఒకవేళ రిలీజ్ పోస్ట్ పోన్ అయితే మరొక నెల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా సినిమా కోసం రాత్రి పగలు కష్టపడైన ఈ సినిమాను కంప్లీట్ చేద్దామనే కాన్సెప్ట్ లో సినిమా టీమ్ ఉంటే మాత్రం ఈ సినిమా అనుకున్న డేట్ కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి…
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Is there a possibility that the release of pawan kalyans og movie will be postponed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com