Pushpa 2 : సినిమా ఇండస్ట్రీలు చాలామంది నటులు వాళ్ల సినిమాలను సక్సెస్ చేయడానికి ఏదో ఒక రకంగా విపరీతమైన ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవదానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మన హీరోలు ముందు వరుసలో ఉంటున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో చాలా వరకు హైలెట్ సీన్స్ ఉన్నప్పటికి అందులో గంగమ్మ జాతర సీన్ మాత్రం సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో గంగమ్మ జాతర కోసం అల్లు అర్జున్ ధరించిన చీర వెనక ఒక పెద్ద కథ కూడా దాగి ఉందనే విషయం మనలో చాలామందికి తెలియదు…
ఇక a కథ ఏంటంటే 900 సంవత్సరాల క్రితం ఊళ్లో పాలేగాడు ఉండేవాడు ఉండేవాడు. వాడు కామాంధుడు వాడికి నచ్చిన అమ్మాయిని అనుభవిస్తూ ఉండేవాడు. అలా కన్య గా ఉన్న అమ్మాయిలను బలాత్కారం చేస్తూ ఉండేవాడు. ఇక వాడికి తెలియకుండా ఎవరిని పెళ్లి కూడా చేసుకొచ్చేవాడు కాదు. ఇలాంటి వాన్ని అంతం చేయడానికి ‘ఆవిలాల’ అనే ప్రాంతంలో ‘గంగమ్మ ‘ అనే అమ్మాయి పుడుతుంది.
ఇక ఆ అమ్మాయి అమ్మవారి స్వరూపం కావడం తో యవ్వనం లో ఆమె చూడడానికి చాలా అందంగా ఉండేది. ఇక ఒకరోజు ఈ పాలెగాడు ఆమెని బలాత్కారం చేయాలని చూస్తాడు. ఇక వాడి నుంచి తప్పించుకున్న గంగమ్మ ఐదు రోజుల్లో నిన్ను చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. దానితో పాలెగాడు భయపడిపోయి పారిపోయి దాక్కుంటాడు. ఇక ఐదు రోజులు ఆమె ఒక్కొక్క వేషం లో వాన్ని వెతుకుతూ ఉంటుంది. ఇక ఐదో రోజు దొరవేశం లో వచ్చి మగ గొంతుతో బూతులు తిడుతూ అరుస్తుంది. దాంతో ఆ పాలెగాడు బయటికి వస్తాడు.
ఇక గంగమ్మ వెంటనే వాడి తల నరికేస్తుంది. ఇక ఈ ఐదు వేషాల్లో ఒక వేషమే ‘మాతంగి వేషం’… ఇక అల్లు అర్జున్ వేసిన వేషం కూడా ఇదే కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి ఒక నటుడు ఇలా గంగామ్మ జాతర అనేది ఒకటి ఉందని దానిని ఈ సినిమా ద్వారా ఎలివేట్ చేసి చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. దీని ద్వారా గంగామ్మ జాతరకి ఉన్న ఇంపార్టెన్స్ కూడా పెరిగిపోతుంది. తద్వారా ఆమె స్టోరీని తెలుసుకోవడానికి ఇప్పుడు చాలామంది ఆసక్తిని కూడా చూపిస్తున్నారు… ఇక మొత్తానికైతే గంగమ్మ జాతర ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవడమే కాకుండా అల్లు అర్జున్ కూడా ఆ వేషంలో చాలా బాగా నటించి ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పాలి…