https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అంబటి అర్జున్ ని బూతులు తిట్టబోయిన విష్ణు ప్రియ..బజ్ ఇంటర్వ్యూ లో నిజస్వరూపం బయట పడిందిగా!

ఆడియన్స్ ఆమెలోని ఆ నిజాయితీని అర్థం చేసుకున్నారు కాబట్టే, ఇన్ని రోజులు బిగ్ బాస్ షో లో ఆమెని సేవ్ చేస్తూ వచ్చారు. దానికి తోడు విష్ణు ప్రియకి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండడం ఆమె ఇన్ని రోజులు సేవ్ అవ్వడానికి కారణం అని కూడా అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 12:25 PM IST

    Bigg Boss Telugu 8(2)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా టాస్కులు ఆడకుండా, చాలా జాలీగా గడుపుతూ, 14 వ వారం వరకు నెట్టుకొచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేరు విష్ణు ప్రియ. బిగ్ బాస్ రియాలిటీ షో అంటే కేవలం టాస్కులు ఆడడం ఒక్కటే కాదు, నిజాయితీగా ఎలాంటి మాస్క్ లేకుండా ఉండడం, గేమ్ కోసం వ్యక్తిత్వం ని మార్చుకోకుండా ఉండడమే అని విష్ణు ప్రియ బలంగా నమ్మింది. ఆమె అన్న మాట మీద చివరి వరకు నిలబడింది. ఆడియన్స్ ఆమెలోని ఆ నిజాయితీని అర్థం చేసుకున్నారు కాబట్టే, ఇన్ని రోజులు బిగ్ బాస్ షో లో ఆమెని సేవ్ చేస్తూ వచ్చారు. దానికి తోడు విష్ణు ప్రియకి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండడం ఆమె ఇన్ని రోజులు సేవ్ అవ్వడానికి కారణం అని కూడా అంటున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ఎలిమినేట్ అయ్యాక విష్ణు ప్రియ బిగ్ బాస్ బజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో నిన్న విడుదలైంది. ఈ ప్రోమో లో ఆమె అర్జున్ అంబటి తో జరిపిన చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా విష్ణు ప్రియ తో అర్జున్ అంబటి మాట్లాడుతూ ‘నేను అసలు బిగ్ బాస్ షో కి కోటి రూపాయిలు ఇచ్చినా వెళ్ళను అని అన్నావు కదా, ఇప్పుడు ఎలా వెళ్ళావు అని అడుగుతాడు’. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అసలు 14 వారాలు ఏమి చేయకుండా బండిని భలే లాగావు’ అని అంటాడు అర్జున్. దానికి విష్ణు ప్రియ సమాధానం చెప్తూ ‘వజ్రాలు ఒత్తిడితోనే తయారు చేస్తారు’ అని అంటుంది. దానికి అర్జున్ చప్పట్లు కొడుతూ ‘ ఈ కొటేషన్ ఆటో వాడికి ఇద్దాము, వెనుక రాసుకుంటాడు’ అని అంటాడు.

    పృథ్వీ గురించి చెప్పావు కాబట్టి, అసలు ఏమిటి మీ బంధం అని అడుగుతాడు అర్జున్. దానికి విష్ణు ప్రియ సమాధానం చెప్తూ ‘పృథ్వీ అనే అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు. అతను నాకు స్నేహితుడి కంటే ఎక్కువ’ అని అంటుంది. స్నేహితుడికంటే ఎక్కువ అంటే ఏంటి నీ ఉద్దేశ్యం అని అర్జున్ అడగగా, దానికి విష్ణు సమాధానం చెప్తూ ‘అంటే కొంచెం ఇన్ ఫ్యాక్చుయేషన్, క్రష్’ అని చెప్పుకొచ్చింది. క్రష్ అంటే ఏంటి అని అర్జున్ అడగగా, దానికి విష్ణు సమాధానం చెప్తూ ‘అంటే కొద్దిగా క్రష్ చేద్దామని’ అని అంటుంది. ఇక ఆ తర్వాత హౌస్ లో 14 వారాలు బలంగా నువ్వు ఆడిన టాస్క్ ఏమిటో చెప్పు అని అడగగా, దానికి విష్ణు ప్రియ బ్యాగ్స్ టాస్క్ అని అంటుంది. నలుగురితో కలిసి ఆడిన గేమ్ కాదు, నువ్వు ప్రత్యేకంగా ఆడింది ఏంటో చెప్పు అని అంటాడు. దానికి విష్ణు ప్రియ బూతులు తిట్టబోయి మధ్యలోనే మింగేస్తుంది. ఈ యాంగిల్ ని నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు చూపించలేదు, ఇక్కడ ఎందుకు చూపిస్తున్నావు అని అంటాడు అర్జున్.