https://oktelugu.com/

Project K: ప్రాజెక్ట్ కే టైటిల్ లీక్? చాలా కొత్తగా ఉందే!

అది జనాల్లోకి వెళ్ళలేదు. ఆర్ ఆర్ ఆర్ ఫైనల్ టైటిల్ గా స్థిరపడింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే విషయంలో అదే జరుగుతుంది. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ బాగా క్లిక్ అయ్యింది. ఇది కూడా బహుభాషా చిత్రం కావడంతో ఇంగ్లీష్ టైటిల్ మేలు చేసే అంశమే. అయితే ప్రాజెక్ట్ కే అంటే ఏమిటో చిత్ర యూనిట్ తెలియజేయనుంది. శాన్ డియాగో కామిక్ కామ్ 2023 జులై 20 నుండి 23 వరకు జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం ప్రాజెక్ట్ కే చిత్రానికి దక్కింది.

Written By: , Updated On : July 10, 2023 / 03:01 PM IST
Follow us on

Project K: ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఓ క్యాచీ వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాడు. ఆర్ ఆర్ ఆర్ అంటే రాజమౌళి రామారావు రాజమౌళి. ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ట్రిపుల్ ఆర్ అనుకున్నారు. అనూహ్యంగా ఆ టైటిల్ బాగా జనాల్లోకి వెళ్ళింది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషల ఆడియన్స్ ని సైతం ఆకర్షించింది. ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ ఆర్ ఆర్ ఆర్ బాగా ప్రాచుర్యం పొందడంతో రాజమౌళి దాన్ని మార్చలేదు. ఆర్ ఆర్ ఆర్ ఆర్ టైటిల్ కి కథకు సెట్ అయ్యేలా రౌద్రం రణం రుధిరం అని ప్రకటించారు.

అది జనాల్లోకి వెళ్ళలేదు. ఆర్ ఆర్ ఆర్ ఫైనల్ టైటిల్ గా స్థిరపడింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే విషయంలో అదే జరుగుతుంది. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ బాగా క్లిక్ అయ్యింది. ఇది కూడా బహుభాషా చిత్రం కావడంతో ఇంగ్లీష్ టైటిల్ మేలు చేసే అంశమే. అయితే ప్రాజెక్ట్ కే అంటే ఏమిటో చిత్ర యూనిట్ తెలియజేయనుంది. శాన్ డియాగో కామిక్ కామ్ 2023 జులై 20 నుండి 23 వరకు జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం ప్రాజెక్ట్ కే చిత్రానికి దక్కింది.

శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే టైటిల్ రివీల్ చేయనున్నారట. అయితే టైటిల్ ఇదే అంటూ ఓ ప్రచారం జరుగుతుంది. కాలచక్ర అనే టైటిల్ యూనిట్ నిర్ణయించారని, ఇదే త్వరలో ప్రకటించబోతున్నారని అంటున్నారు. ప్రాజెక్ట్ కే మూవీ టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని తెలుస్తుంది. ఆ క్రమంలో కాలచక్ర టైటిల్ చక్కగా సరిపోతుందంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. 2024 సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. కమల్ హాసన్ కీలక రోల్ చేయడం విశేషం. ఇక అమితాబ్ బచ్చన్ ఓ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే సైతం రెండు భాగాలుగా రానుందని అంటున్నారు. బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తుంది. అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు.