Bollywood director Telugu heroes: ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణను సంపాదించుకోకపోవడంతో బాలీవుడ్ డైరెక్టర్లకు సైతం డిమాండ్ అయితే పడిపోయింది. దాంతో తెలుగు డైరెక్టర్ల వైపే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. బాలీవుడ్ హీరోలు సైతం తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే మన తెలుగు దర్శకుల హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తన సత్తా చాటుకున్న ఆదిత్యధర్ మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. దురంధర్ సినిమాతో ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేశాడు. ఆయన ఇప్పుడు దురంధర్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండటం విశేషం… ఇక ఆదిత్య ధర్ సైతం ప్రస్తుతం బాలీవుడ్ హీరోలను పట్టించుకోవడం లేదు. ఆయన కూడా తెలుగు హీరోల వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక తెలుగు హీరోలు ఆదిత్య ధర్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు…
ఇక తను కూడా ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలను కలిసి కథలను కూడా వినిపించారట. తొందరలోనే తెలుగు హీరోతో సినిమాను అనౌన్స్ చేస్తానని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నారట. మొత్తానికైతే బాలీవుడ్ మీడియా సైతం ఈ విషయాన్ని చాలా హైలెట్ చేస్తూ చెప్పుకుంటున్నారు.
మరి బాలీవుడ్ హీరోల పరిస్థితి ఎందుకిలా దిగజారి పోయింది. ఎందుకని వాళ్ళు సరైన సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. వాళ్ళ దర్శకులే వాళ్ళని హీరోలుగా పెట్టి సినిమాలు చేయడానికి భయపడిపోతున్నారా అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు వీళ్ళందరూ బాలీవుడ్ మాఫియాగా ఏర్పడి ఈ హీరోలందరు ఇతరుల హీరోల సినిమాలను బయటికి రాకుండా చేసేవారు.
వాళ్లకు నచ్చిన వాళ్ళ సినిమాలను మాత్రమే హైప్ చేసేవారు. ఇతర భాషల నుంచి హీరోల సినిమాలు వచ్చినా కూడా వాటిని ప్రేక్షకులకు చేరువ కాకుండా చేసేవారు. ఇవన్నీ చూసిన అక్కడ జనాలు ఇప్పుడు విసిగిపోయారు. అందుకే ఇతర భాషల నుంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చిన లేదంటే ఇతర హీరోల సినిమాలు భారీ సక్సెస్ లను సాధించిన కూడా వాటిని ఆదరించి ఆయా హీరోలకు అభిమానులుగా మారిపోతున్నారు…