Ram Charan And Sukumar: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ లోనే అతి కష్టసమయంలో ఉన్న సుకుమార్(Director Sukumar) తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) ‘రంగస్థలం’ చిత్రం చేసి ఆయన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో రామ్ చరణ్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రావొచ్చేమో కానీ, రంగస్థలం చిత్రం మాత్రం ఆయన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం అని చెప్పొచ్చు. నటుడిగా రామ్ చరణ్ లోని విశ్వ రూపాన్ని బయటకు తీసిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత ఆయన కష్టాల్లో పడ్డాడు. #RRR చిత్రం మినహా ఆయన చేసిన వినయ విధేయ రామా, ఆచార్య మరియు గేమ్ చేంజర్(Game Changer) చిత్రాలు ఘోరమైన ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు రామ్ చరణ్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఆయన కం బ్యాక్ అవ్వాలంటే కచ్చితంగా సుకుమార్ రేంజ్ డైరెక్టర్ ఉండాల్సిందే .
వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా ఫిక్స్ అయ్యి, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది. పీరియాడిక్ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. #RRR మూవీ షూటింగ్ సమయంలోనే ఈ సినిమా కి సంబంధించిన ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని ఒక షూట్ చేసాడు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం బుచ్చి బాబుతో సినిమా చేస్తున్న రామ్ చరణ్, ఈ సినిమా పూర్తి అయ్యాక వెంటనే సుకుమార్ చిత్రానికి షిఫ్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం సుకుమార్ తో సినిమా దగ్గర్లో లేనట్టే అనిపిస్తుంది. బుచ్చి బాబు తో సినిమా పూర్తి అయ్యాక ఆయన బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్(Nikhil Nagesh Bhat) తో ఒక మైథాలజీ జానర్ ని చేయబోతున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది ఈ దర్శకుడు కిల్(Kill Movie) అనే చిత్రంతో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ చిత్రాన్ని మధు మంతెన నిర్మించనున్నాడు. కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని, త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అంతే కాకుండా హాయ్ నాన్న ఫేమ్ సౌరభ్ తో ఒక సినిమా, అదే విధం గా గౌతమ్ తిన్ననూరి తో మరో సినిమాని కూడా ఆయన ఖరారు చేసినట్టు తెలుస్తుంది. సుకుమార్ కి పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందట. అందుకే సమయం అడిగాడని, దానికి రామ్ చరణ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడట. రామ్ చరణ్ అభిమానులు జీవితాంతం గుర్తించుకోదగ్గ చిత్రంగా ఈ సినిమా నిలవబోతుందని అంటున్నారు. సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడట. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు సీనియర్ దర్శకులు కూడా ఈ సినిమా రైటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేయబోతున్నట్టు సమాచారం.