Salman and Aishwarya Rai Love Story: బాలీవుడ్ లో ఒకప్పుడు సల్మాన్ ఖాన్(Salman Khan), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) లవ్ స్టోరీ ఒక సెన్సేషన్. వీళ్ళిద్దరిది అప్పట్లో చాలా గాఢమైన ప్రేమ. ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరు కొన్ని అనుకోని సంఘటనలు కారణంగా విడిపోవాల్సి వచ్చింది. వీళ్ళ లవ్ స్టోరీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది. సినిమాగా తీస్తే ఒక కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ గా హిస్టరీ లో నిలిచిపోతాది. వీళ్లిద్దరి ప్రేమ ఎలా మొదలైంది?, పెళ్లి పీటలు వరకు వచ్చిన వీళ్ళ ప్రేమ, ఎందుకు బ్రేకప్ అయ్యింది?, ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది?, ఇలాంటి విషయాలను తెలుసుకోవాలని ఆడియన్స్ లో ఎప్పటి నుండో కుతూహలం ఉంది. వీళ్ళ లవ్ స్టోరీ బ్రేకప్ పై సోషల్ మీడియా లో వందల కథనాలు ఉన్నాయి, కానీ వాస్తవాలు ఏంటో ఎవరికీ తెలియదు.
రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత శైలేంద్ర సింగ్ వీళ్లిద్దరి లవ్ స్టోరీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘సల్మాన్, ఐశ్వర్యల లవ్ స్టోరీ రోమియో, జూలియట్ తరహాలో చాలా ఎమోషనల్ కమ్ వయొలెంట్ లవ్ స్టోరీ. ఐశ్వర్య రాయ్ చాలా గౌరవప్రదమైన, తెలివైన అమ్మాయి. సల్మాన్ ఖాన్ చాలా ఫ్యాషనేట్, సున్నితమైన మనసు కలిగిన వాడు. సల్మాన్ ఖాన్ కంటే ముందు ఐశ్వర్య రాయ్ ప్రముఖ మోడల్ రాజీవ్ మూల్ చందనీ తో మాత్రమే ప్రేమాయణం నడిపింది. ఇంకెవ్వరితోనూ ఆమె రిలేషన్ పెట్టుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలను బట్టీ చూస్తుంటే అతనికి సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ లవ్ స్టోరీ మీద ఒక సినిమా చెయ్యాలనే కోరిక మనసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీ తియ్యడం అనేది ఆశా మాషీ విషయం కాదు.
సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ వద్ద నుండి అనుమతి తీసుకోవాలి. సల్మాన్ ఖాన్ వద్ద ఈ ప్రస్తావన తీసుకొస్తే, ఆయన రియాక్షన్ వేరేలా ఉండొచ్చు. గూబ గుయ్ మని కొట్టినా కొట్టొచ్చు. అంత సాహసం చేయడు. కానీ పరోక్షంగా వీళ్ళ లవ్ స్టోరీ అని చెప్పకుండా, తీసిన తీయొచ్చు. చూడాలి మరి ఆ సాహసం ఇతను చేస్తాడా లేదా అనేది. ఒకవేళ చేస్తే అందులో సల్మాన్ ఖాన్ పాత్ర ని ఎవరు చేయబోతున్నారు?, ఐశ్వర్య రాయ్ పాత్రని ఎవరు చేయబోతున్నారు? అనేది చూడాలి.