Future of film industry: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తారు. కాబట్టి వాళ్ల గురించి ఎక్కువగా జనాల్లో చర్చలైతే జరుగుతాయి. కానీ హీరోలు వాళ్ళు చేసిన సినిమాలకు రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకొని సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఒక సినిమా సక్సెస్ అయిన, ఫెయిల్యూర్ అయిన వాళ్లకు మాత్రం నష్టాలైతే రావు. కానీ దర్శకుడు కి గాని, ఆ సినిమాకి బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్ కి గాని విపరీతమైన నష్టలైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడి కి ఒకసారి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే అతనికి మరొక సినిమా చేసే అవకాశం ఉండదు. ఇక ప్రొడ్యూసర్ ఆ సినిమాకి పెట్టిన డబ్బులు అన్ని వృధా అయిపోతుంటాయి. మరి ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా అనేది చచ్చిపోయింది… ఎంత మంచి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాలను చూసే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ సినిమా టాక్ బాగుంటే ఆ సినిమా పర్లేదు అనే రేంజ్ లో ఆడుతోంది. కానీ చిన్న సినిమాల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఒక సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్న కూడా ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాను చూడడం లేదంటే చిన్న సినిమాలు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయనే చెప్పాలి. మరి ఇలాగే కంటిన్యూ అయితే చిన్న సినిమాలు ఇండస్ట్రీలో చచ్చిపోయే అవకాశాలైతే ఉన్నాయి అంటూ చాలామంది ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారు ఎవరు ఈ విషయాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు చిన్న సినిమాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
నిజానికి త్రిభానా దారి భార్బరిక్ అనే సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది అయినప్పటికీ ఆ సినిమాను చూడడానికి ఏ ఒక్క ప్రేక్షకుడు థియేటర్ కి రావడం లేదంటూ ఆ మూవీ డైరెక్టర్ ఒక వీడియో చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు.
అలాగే తన చెప్పుతో తాను కొట్టుకున్నాడు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటే ఇంతకు ముందు తో పోలిస్తే ఇప్పుడు ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ని అందించే సోర్స్ ఎక్కువైపోయింది. మొబైల్ ద్వారా కూడా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారు.
ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో రీల్స్ చూస్తూ కూడా కాలాన్ని గడిపేస్తున్నారు. దీనివల్ల థియేటర్ కి వచ్చి సినిమాను చూసే అంత టైం గాని, దానికోసం మనీ ని వెచ్చించే ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం లేదు… ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి ఐసీయూలో ఉన్న పేషెంట్ మాదిరిగా ఉంది. మరి ఆ పేషెంట్ ని ఎవరైనా కాపాడతారా? లేదంటే చచ్చిపోయే పరిస్థితి వస్తుందా? అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…