https://oktelugu.com/

Devara: ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ డ్యాన్స్ ‘దేవర’ లో ఉండబోతుందా..? వైరల్ గా మారిన లేటెస్ట్ అప్డేట్!

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కి కూడా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మంచి రీచ్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న రత్నవేలు అభిమానులకు కిక్ ని ఇచ్చే వార్త ఒకటి చెప్పాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 11, 2024 / 05:53 PM IST

    Devara

    Follow us on

    Devara: ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే మాస్ ఆడియన్స్ లో ఒక జాతర ని తలపించే వాతావరణం ఏర్పడడం సర్వ సాధారణమైన విషయం అనే సంగతి మన అందరికీ తెలిసిందే. చిన్న వయస్సు లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఏడాదికి రెండు మూడు సినిమాలు కచ్చితంగా చేసేవాడు. అలాంటి ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రం తర్వాత భారీ గ్యాప్ ఇచ్చాడు. మధ్యలో #RRR వచ్చినప్పటికీ కూడా అది సోలో సినిమా కాకపోవడం తో ఎన్టీఆర్ అభిమానుల ఆకలి పూర్తిగా తీరలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన నుండి సోలో చిత్రం గా ‘దేవర’ విడుదల కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

    ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కి కూడా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మంచి రీచ్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న రత్నవేలు అభిమానులకు కిక్ ని ఇచ్చే వార్త ఒకటి చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ సాంగ్ ని షూట్ చేస్తున్నాం. ఎన్టీఆర్ నుండి అభిమానులు ఎలాంటి డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని కోరుకుంటారో, అలాంటి స్టెప్స్ ఈ పాటలో ఉండబోతున్నాయి. ఈ పాట కి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు మించి ఈ పాట ఉండబోతుంది. ఈ పాటలో ఎన్టీఆర్ వేసే స్టెప్పులు ఎంతో గ్రేస్ తో ఉంటాయి. ఇలాంటి డ్యాన్స్ చేసి ఆయన చాలా కాలం అయ్యింది. అభిమానులు థియేటర్స్ లో చొక్కాలు చింపుకుంటారు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ నుండి సరైన డ్యాన్స్ నెంబర్ చూసి చాలా కాలమే అయ్యింది. ‘నాటు నాటు’ సాంగ్ మినహా, అదిరిపోయే కొరియోగ్రఫీ తో ఎన్టీఆర్ డ్యాన్స్ టాలెంట్ ని మ్యాచ్ చేసే విధంగా కొరియోగ్రాఫర్స్ ప్లాన్ చేయలేకపోయారు. కానీ ఈ చిత్రం తో అభిమానుల్లో ఉన్న లోటు తీరుతుందని రత్నవేలు చెప్పుకొచ్చాడు.

    ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలా భారీ తారాగణంతో ఈ చిత్రం గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కింది. మరి సెప్టెంబర్ 27 వ తారీఖున అభిమానుల ఆకలి తీరుతుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు కొరటాల గత చిత్రం ఆచార్య భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ ఫేస్ నుండి తనని తానూ ప్రూవ్ చేసుకోవాలనే కసితో కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని టాక్.