https://oktelugu.com/

Rakesh Master Death : రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణం అదేనా..? సంచలన నిజాలు బయటపెట్టిన డాక్టర్లు!

అలా దూసుకెళ్తున్న రాకేష్ మాస్టర్ హఠాత్తుగా ఇలా చనిపోవడానికి కారణం మితిమీరిన ఎండలే అని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ఏ స్థాయిలో ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. సన్ స్ట్రోక్ తగిలి చాలామంది చనిపోయారు కూడా, ఇప్పుడు ఆ జాబితాలోకి రాకేష్ మాస్టర్ కూడా చేరిపోవడం దురదృష్టకరం.

Written By:
  • Vicky
  • , Updated On : June 18, 2023 / 07:21 PM IST
    Follow us on

    Rakesh Master Death : ఎల్లప్పుడూ చలాకి గా ఉంటూ ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించే రాకేష్ మాస్టర్ హఠాత్తుగా చనిపోయాడు అనే వార్త టాలీవుడ్ ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా ని తరచూ వాడే నెటిజెన్స్ రాకేష్ మాస్టర్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే రాకేష్ మాస్టర్ తాను యూట్యూబ్ లో స్థాపించిన SRK ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సరికొత్త కామెడీ కంటెంట్ మరియు ఇంటర్వ్యూస్ తో యువత కి ఎంతో దగ్గరయ్యాడు.

    రోజంతా కస్టపడి పనిచేసి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకునేవాళ్లు కాసేపు ఆయన యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్తే మంచి వినోదం ని ఆస్వాదించి కడుపుబ్బా నవ్వుకుంటారు. వారం రోజుల క్రితం వరకు కూడా ఆయన కొన్ని వీడియోస్ ని అప్లోడ్ చేసాడు. సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న అగ్గిపెట్టె మచ్చ, సునిశిత్ ,స్వాతి నాయుడు తదితరులతో ఆయన రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ప్రోగ్రాం డిజైన్ చేసాడు.

    దానికి సంబంధించిన వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అలా దూసుకెళ్తున్న రాకేష్ మాస్టర్ హఠాత్తుగా ఇలా చనిపోవడానికి కారణం మితిమీరిన ఎండలే అని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ఏ స్థాయిలో ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. సన్ స్ట్రోక్ తగిలి చాలామంది చనిపోయారు కూడా, ఇప్పుడు ఆ జాబితాలోకి రాకేష్ మాస్టర్ కూడా చేరిపోవడం దురదృష్టకరం. శ్రీకాకుళం లో ప్రోగ్రాం చేస్తున్న రాకేష్ మాస్టర్ , అకస్మాత్తుగా స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోవడం తో ఆయనని వెంటనే వైజాగ్ హాస్పిటల్ కి తరలించారు.

    అక్కడ గత కొద్దిరోజుల నుండి చికిత్స పొందుతున్న రాకేష్ మాస్టర్ నేడు తన తుదిశ్వాసని విడిచాడు. ఆయన లేని లోటు కచ్చితంగా ఎవ్వరూ పూడవలేనిది,విభిన్నమైన మనస్తత్వం ఉన్న రాకేష్ మాస్టర్ ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేసాడు. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాం.