Sankranti 2024 Movies: సంక్రాంతి సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఆగిపోవడానికి అసలు కారణం అదేనా..?

పోలీస్ సిబ్బంది సమస్య రావడంతో ఈ ఫంక్షన్ ని 6వ తేదీన నిర్వహించడానికి పర్మిషన్ రాలేదు. దాంతో ఈ సినిమా ఈవెంట్ ఏడవ తేదీన జరుపుకునే ఆలోచనలో ఉన్నట్టు గా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : January 6, 2024 1:38 pm

Sankranti 2024 Movies

Follow us on

Sankranti 2024 Movies: ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హవా నడుస్తుంది. ఇక ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్ని కూడా భారీగా ప్రమోషన్లు చేస్తూ ముందుకు కదులుతున్నాయి. ఇక అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్లను చేయడానికి సంక్రాంతి సినిమాలు ముందుగానే డేట్లని అనౌన్స్ చేశాయి. అందులో భాగంగానే గుంటూరు కారం సినిమా యూనిట్ జనవరి 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.

కానీ పోలీస్ సిబ్బంది సమస్య రావడంతో ఈ ఫంక్షన్ ని 6వ తేదీన నిర్వహించడానికి పర్మిషన్ రాలేదు. దాంతో ఈ సినిమా ఈవెంట్ ఏడవ తేదీన జరుపుకునే ఆలోచనలో ఉన్నట్టు గా తెలుస్తుంది. ఇక గుంటూరు కారం 6 న ఈవెంట్ జరుపుకుంటుందని హనుమాన్ సినిమా వాళ్ళు 7 వ తేదీన వాళ్ల సినిమా ఫంక్షన్ ని పెట్టుకోడానికి డిసైడ్ అయి డేట్ కూడా అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా తో పాటుగా వెంకటేష్ హీరో గా వస్తున్న సైంధవ్ సినిమా ఈవెంట్ ని కూడా 7 వ తేదీన వైజాగ్ లో జరపడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఇప్పటికే హనుమాన్ సినిమా ఫంక్షన్ కి చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు మూడు సినిమాల రిలీజ్ ఈవెంట్లు కూడా ఒకేరోజు జరుపుకోవాల్సి వస్తుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. మరి గుంటూరు కారం సినిమా ఆదివారం నాడు నిర్వహించకుండా 8 వ తేదీ అయిన సోమవారం నాడు నిర్వహిస్తారా అంటే సోమవారం రోజున హాలిడే కాదు కాబట్టి ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెద్దగా బజ్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశ్యం తో వాళ్లు కూడా సండేనే అంటే 7 వ తేదీనాడే ఈ ఫంక్షన్ ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక అలాగే మూడు ఫంక్షన్లని ఒకేరోజు నిర్వహిస్తే ఒక ప్రాబ్లం ఏంటి అంటే వాటిని టెలికాస్ట్ చేసే చానల్స్ కి ఇబ్బంది కలుగుతుంది. అలాగే యూట్యూబ్ లో వాటిని చూడడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అంటూ పలువురు సీనీ ప్రముఖులు వాళ్ల అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. ఇక మూడు సినిమాల ఈవెంట్లు ఒకేరోజు జరిగితే వీటిలో ముందుగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాకి జనాలు ఎక్కువ ప్రియార్టీని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దాని మీదనే జనాల్లో ఎక్కువ బజ్ ఉంది కాబట్టి దానికే ప్రియార్టీ ఇస్తారు. ఇక ఇలాంటి సమయంలో ఈ రెండు సినిమా ఫంక్షన్ల మీద కొద్దిగా ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి రెండు సినిమాలు వాళ్ళ డేట్ ని ఏమైనా మార్చుకునే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మరి కొద్దీ గంటలు వేచి చూడాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ప్రతి సినిమా ఈవెంట్ కి సుమ చేత యాంకరింగ్ చేయించడం ఒక సెంటిమెంట్ గా భావిస్తుంటారు. కానీ ఇప్పుడు సుమ హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా వ్యవహరించనున్నారని తెలుస్తుంది…