Sandeep Vanga And Venkatesh: టాలీవుడ్ లో సంచలన దర్శకుడుగా గుర్తింపు పొందిన సందీప్ రెడ్డి వంగా మొదటి సినిమా అయిన అర్జున్ రెడ్డి తోనే భారీ సక్సెస్ ని అందుకొని ఇండస్ట్రీలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక అదే విధంగా అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ ని అందుకున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన అనిమల్ సినిమాతో మరొకసారి భారీ హిట్ అందుకొని 900 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి తన సత్తా ఏంటో పాన్ ఇండియా రేంజ్ లో చాటుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతం గా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సీనియర్ హీరో అయిన వెంకటేష్ ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్నాడనే వార్తలు పుష్కలంగా వస్తున్నాయి. నిజానికి అర్జున్ రెడ్డి సినిమాని మొదట సందీప్ రెడ్డి వంగా వెంకటేష్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది.
అయితే ఇంతవరకు ఈ న్యూస్ ఎక్కడ కూడా రాలేదు కానీ ఇది వాస్తవమని తెలుస్తుంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ అక్కడ కలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా వెంకటేష్ గారిని కలిసి ఆయనకి కథ చెప్పాడంట. అప్పటికే వెంకటేష్ కి ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు ఉండడంతో ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయడం అనేది తనకి సాధ్యపడదని సందీప్ రెడ్డి వంగకి చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేసి సందీప్ వంగ అప్పుడు శర్వానంద్ కి కథ చెప్పాడు. శర్వానంద్ కూడా అదే మాట చెప్పడంతో ఈ సినిమాని విజయ్ దేవరకొండ తో చేసి ఒక గ్రాండ్ సక్సెస్ ని కొట్టాడు.
మొత్తానికైతే వెంకటేష్ ఒక మంచి హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వెంకటేష్ కి ఇలాంటి సినిమా సెట్ అయ్యేదా, కాకపోయేదా అనే విషయం పక్కన పెడితే ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమాని మాత్రం వెంకటేష్ మిస్ చేసుకున్నాడు అనేది వాస్తవం…