Ravi Tejaఒకప్పుడు మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే ఆడియన్స్ కి మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్. వ్యక్తిగత వ్యవహారాల్లో ఎన్నో కష్టాలు పడే ఆడియన్స్ కి కాసేపు రిలాక్స్ కోసం రవితేజ సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. అలాంటి రవితేజ మార్కెట్ ఇప్పుడు రిస్క్ లో పడింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అలవోకగా కొట్టగల స్టామినా ఉన్న హీరో రవితేజ. ఆయన నటించిన క్రాక్, ధమాకా చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. మరి ఆ రేంజ్ స్టామినా ఉన్న రవితేజ, మరో లెవెల్ కి వెళ్లే సినిమాలు ఎందుకు చెయ్యడం లేదు అని ఆయన అభిమానులు ఆవేదన సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రవితేజ మాత్రం అభిమానుల ఆలోచనలను, వాళ్ళ కోరికలను అసలు పట్టించుకోవడం లేదు, స్క్రిప్ట్ ఎలా ఉన్నా సరే, డబ్బులు వస్తున్నాయి కదా అనే ఏకకాలంలో నాలుగైదు సినిమాలు చేసేస్తున్నాడు. అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.
ధమాకా చిత్రం తర్వాత ఆయన నాలుగు సినిమాలను విడుదల చేస్తే, ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన మిస్టర్ బచ్చన్ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇలా రవితేజ ఏకకాలంలో రెండు మూడు సినిమాలు చెయ్యడం వల్ల ఆయనతో పెద్ద డైరెక్టర్స్ పని చెయ్యడానికి ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకి 7 ఏళ్ళ క్రితం ప్రశాంత్ నీల్ రవితేజ తో ఒక సినిమా చేసేందుకు బాగా ప్రయత్నాలు చేసాడట. అప్పట్లో ఆయన అంత గొప్ప డైరెక్టర్ కాదు, అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త డైరెక్టర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనతో సినిమాలు చేసే అవకాశం దొరికితే సూపర్ స్టార్స్ కూడా అదృష్టం లాగ భావించే రేంజ్ కి వచేసాడు.
అయితే సినిమా ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చిన ప్రశాంత్ నీల్, తెలుగు హీరోలతో ఒక సినిమా తియ్యాలనే కోరికతో ముందుగా రవితేజ ని కలిసాడు. కొత్త డైరెక్టర్స్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉండే రవితేజ , ప్రశాంత్ నీల్ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ సమయం లో ఆయన అప్పటికే నాలుగు చిత్రాలు లైన్ లో పెట్టి ఉన్నాడు. ఇవన్నీ పూర్తి అయితే కానీ నీ సినిమాకి డేట్స్ ఇవ్వలేను అని చెప్పాడట రవితేజ. అందుకు ఒప్పుకున్న ప్రశాంత్ నీల్ కొంతకాలం రవితేజ కోసం ఎదురు చూసాడు. ఆయన నుండి కబురు రాకపోవడంతో వేరే సినిమాకి కమిట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అలా ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది. ఒకవేళ ప్రశాంత్ నీల్ తో రవితేజ సినిమా చేసి ఉండుంటే ఈరోజు రవితేజ ఏ స్థాయిలో ఉండేవాడో ఊహించుకోవచ్చు.