Pawan Kalyan Namrata Shirodkar combo: కొన్ని క్రేజీ కాంబినేషన్ సినిమాలు సెట్స్ దాకా వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోతుంటాయి. అలా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), నమ్రతా శిరోడ్కర్(Namratha Sirothkar) కాంబినేషన్ లో కూడా ఒక సినిమా ఇలాగే ఆగిపోయింది అట. మహేష్ బాబు సతీమణి తో పవన్ కళ్యాణ్ సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమాకు క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా పై కూడా అప్పట్లో అలాంటి క్రేజ్ ఏర్పడింది అట. ఈ చిత్రాన్ని నమ్రత శిరోడ్కర్ మహేష్ బాబు తో పెళ్లి కి ముందు ఒప్పుకుందట. ఆ సినిమా మరేదో కాదు ‘బాలు’. ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ చిత్రం అని చెప్పొచ్చు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా శ్రీయ శరన్ నటించింది. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా నమ్రత శిరోడ్కర్ ని అనుకున్నారట.
నిర్మాత అశ్వినీదత్ ఆమెతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. కానీ అనుకోకుండా మహేష్ బాబు సడన్ గా పెళ్లి ప్రతిపాదన తీసుకొని రావడం, పెళ్లి తర్వాత సినిమాలు చెయ్యకూడదు అని నిర్ణయం నమ్రత శిరోడ్కర్ తీసుకోవడం వల్ల ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మేకర్స్ శ్రీయ ని సంప్రదించారు. ఒకవేళ ఈ సినిమా నమ్రత శిరోడ్కర్ చేసి ఉండుంటే, సినిమా ఫలితం ఎలా ఉన్నా, మహేష్ బాబు సతీమణి పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమా ఇదే అని అభిమానుల జ్ఞాపకాల్లో ఉండేది. కానీ బ్యాడ్ లక్, ఇలా నమ్రత శిరోడ్కర్ పెళ్లి కి ముందు సంతకాలు చేసిన ఎన్నో సినిమాలు పెళ్లి తర్వాత వదులుకోవాల్సి వచ్చింది. ఒక్క మెగాస్టార్ చిరంజీవి ‘అంజి’ చిత్రాన్ని మాత్రమే పూర్తి చేసింది. అప్పటికే ఆమె పై అనేక సన్నివేశాలను చిత్రీకరించి ఉన్నారు, మధ్యలో ఆపేస్తే సినిమా టీం కి భారీ నష్టం జరుగుతుంది అనే ఉద్దేశ్యం తో ఈ సినిమాని ఆమె పూర్తి చేసింది.
ఇక పెళ్లి తర్వాత నమ్రత శిరోడ్కర్ ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కనీసం మహేష్ బాబు సినిమాలో కూడా ఆమె చిన్న స్పెషల్ లో కూడా కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు కొన్ని కమర్షియల్ యాడ్స్ లో మాత్రం కనిపించేది. ఎక్కువ శాతం తన జీవితం మొత్తం కుటుంబ వ్యవహారాలను చూసుకోవడం, అదే విధంగా వ్యాపారాలను మైంటైన్ చేయడం కోసమే ఆమె తన సమయాన్ని కేటాయించింది. మహేష్ బాబు కేవలం సినిమాలు చేసి డబ్బులు మాత్రమే సంపాదిస్తాడు, మిగిలినవి మొత్తం నమ్రత శిరోడ్కర్ చూసుకుంటుంది. ఈ కాలం లో ఇలాంటి భార్యలు దొరకాలంటే నిజంగా అదృష్టం ఉండాలి.