Sushmita Konidela favorite actor: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు సక్సెస్ అయ్యారు. ఆయన కూతురు సుస్మిత(Sushmitha Konidela) కూడా కెరీర్ పరంగా సక్సెస్ అయ్యినట్టే. ముందుగా ఈమె మెగాస్టార్ చిరంజీవి కి రీ ఎంట్రీ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఆ తర్వాత ఈమె ‘గ్లోడ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే సంస్థ ని స్థాపించి పలు విజయవంతమైన వెబ్ సిరీస్ లను నిర్మించింది. ఇప్పుడు ఈమె ఏకంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ని హీరో గా పెట్టి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని నిర్మించింది. మరో 5 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, సుష్మిత పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
యాంకర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ ఇంట్లో ఇంత మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా మీకు బాగా ఇష్టమైన బయట హీరో ఎవరు?’ అని అడగ్గా, దానికి సుస్మిత క్షణం కూడా ఆలోచించకుండా రజినీకాంత్ పేరు చెప్తుంది. చిన్నతనం నుండి ఆయన సినిమాలే చూస్తూ పెరిగామని, ఆయన స్టైల్, యాక్టింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక నేటి తరం హీరోలలో ఎవరు ఇష్టం అని అడగ్గా, అందరూ ఇష్టమే, మన తెలుగు సినిమా స్థాయిని నేటి తరం స్టార్ హీరోలు అంతర్జాతీయ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చెప్పలేం అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే నేడు ఆమె మొదటి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
ఇప్పటి వరకు సుస్మిత పబ్లిక్ ఈవెంట్స్ లో మాట్లాడడం మనం ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ఈ సినిమా నిర్మాతగా ఆమె ఎలా మాట్లాడబోతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రేపు , లేదా ఎల్లుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. టికెట్ రేట్స్ జీవో నేడే రానుంది. తెలంగాణ హైకోర్టు కూడా టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని అనుమతి ఇవ్వడం తో ఇక మెగా ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమయ్యారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలు, లెక్క 200 కోట్ల నుండి మొదలు కాబోతుంది అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.