Adipurush Graphics: యంగ్ రెబెల్ స్టార్ హీరో గా నటించిన ఆదిపురుష్ సినిమా పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రామాయణం ని ‘మోషన్ కాప్చర్ టెక్నాలజీ’ తో సరికొత్తగా చూపించి అభిమానులను థ్రిల్ కి గురి చేసే ప్రయత్నం ఓం రాత్ చాలా గట్టిగానే చేసాడు..కానీ నిన్న విడుదలైన టీజర్ లో ఉన్న గ్రాఫిక్స్ కి అభిమానుల నుండి మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది..మోషన్ కాప్చర్ టెక్నాలజీ అంటే ఇదా..హాలీవుడ్ మూవీస్ లో మోషన్ కాప్చర్ టెక్నాలజీ ని ఉపయోగించి చాలా సహజంగా గ్రాఫిక్స్ ఉండేట్టు చేసారని..కానీ ఇక్కడ ఎదో కార్టూన్ సినిమాని చూస్తున్నట్టే అనిపించిందని..500 కోట్ల రూపాయిలు ఈ టెక్నాలజీ కోసం ఖర్చుచేసారంటే నమ్మశక్యంగా లేదు..ఇలాగె సినిమా మొత్తం కనుక ఉంటె కచ్చితంగా పెద్ద ఫ్లాప్ అవుతుందని అభిమానుల దగ్గర నుండి క్రిటిక్స్ వరుకు నెగటివ్ టాక్ వినిపించింది..అంతే కాకుండా రాముడి గా ప్రభాస్ లుక్స్ కూడా ఆశించిన స్థాయి లో గొప్పగా లేవని..ఇక రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ అసలు సూట్ అవ్వలేదని..రావణాసురిడి గెటప్ ని మార్చేసి ఇష్టమొచ్చినట్టు తీసి పవిత్రమైన మన రామాయణ గాదని అపహాస్యం చేసే విధంగా డైరెక్టర్ ఈ సినిమాని తీసినట్టు అనిపించింది అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా గ్రాఫిక్స్ చేసిన కంపెనీ గురించి సోషల్ మీడియా లో ఒక ప్రచారం జోరుగా సాగుతుంది..ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కొన్నేళ్ల క్రితం VFX వాలా అనే కంపెనీ ని ప్రారంభించారు..బాలీవుడ్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద అధికంగా ఆధారపడే ఎన్నో సినిమాలు ఈయన కంపెనీ నుండే తయారయ్యాయి..అలా ఆదిపురుష్ సినిమాకి కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ VFX వాలా కంపెనీ డిజైన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి..దీని పై అజయ్ దేవగన్ కంపెనీ ‘VFX వాలా’ ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది..ఆదిపురుష్ సినిమాకి మా కంపెనీ కి ఎలాంటి సంబంధం లేదని..సోషల్ మీడియా లో వస్తున్నా ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read: Prabhas Health: ప్రభాస్ ఆరోగ్యానికి ఏమైంది అంటూ అభిమానుల ఆందోళన..వైరల్ అవుతున్న వీడియో

అయితే సోషల్ మీడియా లో ఆదిపురుష్ టీజర్ లో ఉన్న గ్రాఫిక్స్ పై వెలువడుతున్న వ్యతిరేకతని గమనించి VFX వాలా కంపెనీ కావాలని తప్పించుకుంటుందని..ఎందుకంటే ఈ కంపెనీ కో ఫౌండర్ ప్రసాద్ సుతార్ ఆది పురుష్ సినిమాకి సహా నిర్మాతగా వ్యవరించడమే కాకుండా, ఈ సినిమాకి VFX డిజైనర్ గా కూడా పనిచేశాడని..అలాంటిది ఆది పురుష్ సినిమాకి మరియు VFX వాలా కంపెనీ కి సంబంధం లేకుండా ఎలా ఉంటుందని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు..మరి దీనిపై హీరో అజయ్ దేవగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
[…] […]
[…] […]