Saif Ali Khan : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)… ఈయన మంచి చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ నటుడి మీద గత రెండు రోజుల క్రితం తన ఇంట్లోనే ఒక దుండగుడు కత్తితో దాడి చేసిన విషయం యావత్ ఇండియా మొత్తాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. ఇక ప్రస్తుతం సైఫ్ అలి ఖాన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదంటూ వైద్యులు వెల్లడించారు. ఇక ప్రస్తుతానికి ఆయనకు కొన్ని సర్జరీలైతే చేస్తున్నట్టుగా వైద్యులు తెలియజేశారు…ఇక ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ వాళ్ల పూర్వికులది భారతదేశము కాదు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ వాళ్ళ పూర్వీకులు ఏ దేశం నుంచి ఇండియాకి వచ్చారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల్లో సలీమ్ అద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన వాడు… బాబర్ సైన్యంలో సేనాధిపతిగా ఉంటూ తన పదవి బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చాడు. ఇక కాల క్రమేణ బాబర్ ఇండియా మీద దాడి చేసినప్పుడు సలీమ్ అద్ ఖాన్ బాబర్ తోపాటు ఇండియా కి వచ్చాడు. ఇక బాబర్ తో పాటు తను కూడా ఇక్కడే సెటిల్ అయిపోయాడు. ఇక ఇక్కడ బాబర్ మొగల్ సామ్రాజ్యం స్థాపించడంతో సలీమ్ అద్ ఖాన్ వంశస్థులు కూడా బాబర్ కి అతని సామ్రాజ్యానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు…ఇక ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. దాంతో వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండడంతో మొగల్ సామ్రాజ్యాధినేతలు ఏమీ చేయలేక వాళ్లకు లొంగిపోయారు. ఇక దాంతో సలీమ్ అద్ ఖాన్ వంశస్థులు అయిన అలాబ్ ఖాన్ బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి వాళ్లతో పాటు సన్నిహిత్యంగా ఉంటూ వచ్చాడు…
ఇక ఇండియాలో ఉన్న రాజులను ఓడించడంలో అతను బ్రిటిష్ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ రావడంతో అలబ్ ఖాన్ తెలివి తేటలకు మెచ్చిన బ్రిటిష్ జనరల్ అయిన లార్డ్ లేక్ హర్యానాలోని పటౌడి అనే ప్రాంతాన్ని అలబ్ ఖాన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు… ఇక ఈ రాజ్యం పెద్దది కావడంతో అలబ్ ఖాన్ తన కొడుకు అయిన తలబ్ ఖాన్ ను మొదటి పటౌడి నవాబుగా పట్టాభిషేకం చేశాడు…
ఇక పటౌడి సామ్రాజ్యం మొదలైంది… ఇక తలబ్ మరణం తర్వాత ఆయన కొడుకు అయినా అక్బర్ అలీ ఖాన్ నవాబుగా మారి చాలా బుద్ధిమంతుడి గా పేరు ప్రఖ్యాతాలను అందుకున్నాడు… ఇక ఇతనికి ఐదుగురు కొడుకులు ఉండటం తో మొదటి కొడుకు అయినా ‘మహమ్మద్ తాకియా అలీ ఖాన్’ కు మూడోవ నవాబుగా పట్టాభిషేకం చేశాడు.
ఇక ఆ తర్వాత నాల్గోవ నవాబుగా ‘ముక్తర్ అలీ ఖాన్’ ఇక వీళ్ల తర్వాత ఐదో నవాబుగా ‘ముంతాజ్ హుస్సేన్’ ,ఆ తర్వాత ఆరోవ నవాబుగా ‘మహమ్మద్ ముజాఫర్ అలీ ఖాన్’, ఏడోవ నవాబుగా ‘ఇబ్రహీం అలీ ఖాన్’ , ఎనిమిదొవ నవాబుగా ‘ఇఫ్తికర్ అలీ ఖాన్’ లు ఏలుతూ వచ్చారు. ఇక ఈ ఇఫ్తికర్ కొడుకు అయినా ‘మైసూర్ అలీ ఖాన్’ అలియాస్ ‘టైగర్ పటౌడి’ కొడుకే ‘సైఫ్ అలీ ఖాన్’… ఇలా పదోవ నవాబు గా సైఫ్ అలీ ఖాన్ కొనసాగుతున్నాడు. మరి మొత్తానికైతే పటౌడి చరిత్ర అనేది ఇలా ఇండియా కి వచ్చింది…