Saif Ali Khan : సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తే మంచి పేరు రావడమే కాకుండా విపరీతమైన డబ్బులను కూడా సంపాదించొచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ సక్సెస్ ని సాధించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ప్రస్తుతం సక్సెస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంతకుముందు ఎన్నో కష్టాలను పడి తిని తినక పస్తులుండి ముందుకు సాగిన వారు మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ లను అందుకుంటున్నారు…
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒకప్పుడు అమితాబచ్చన్ (Amitha Bachhan) తన సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన తర్వాత వచ్చిన హీరోలు సైతం బాలీవుడ్ ని ఏలుతూ ముందుకు సాగుతూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) లాంటి హీరోలు సైతం తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా చాలా అవార్డులను, రివార్డులను కూడా తీసుకొచ్చి పెట్టాయి…ఇక ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ హర్యానాకు చెందిన పటౌడి ఫ్యామిలీ అనే విషయం మనందరికీ తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ నాన్న మైసూర్ అలీ (Maisur Ali) అలియాస్ టైగర్ పటౌడి హర్యానాలో తొమ్మిదొవ పటౌడి నవాబుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… అయితే చిన్నతనంలోనే అతనికి యాక్సిడెంట్ జరగడం వల్ల అతనికి ఒక కన్ను అయితే కనబడకుండా పోయింది అయినప్పటికీ తను తన తండ్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్రికెటర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో క్రికెట్ లో శిక్షణ తీసుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా అతను 1962వ సంవత్సరం నుంచి 1970 వ సంవత్సరం వరకు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా కొనసాగడమే కాకుండా చాలా మంచి ప్లేయర్ గా గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక ఆయన సారాధ్యంలో ఇండియన్ టీమ్ చాలా మ్యాచ్ ల్లో విజయాలను సాధించడమే కాకుండా ఎన్నో కప్పులను కూడా గెలుచుకుంది.
మరి మొత్తానికైతే ఆయన సాధించిన విజయాలు చాలా గొప్పవనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ మీద గుర్తుతెలియని దుండగుడు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. మరి ప్రస్తుతం ఆయన లీలావతి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
ఇక నిదానంగా కోలుకుంటున్నా ఆయన తొందర్లోనే రికవరీ అయి మళ్లీ ఇంతకుముందు ఎలా అయితే సినిమాలను చేస్తూ తన అభిమానులను అలరించాడో అలానే సినిమాలు చేస్తు అందరిని మెప్పించాలని కోరుకుందాం…