Sai Dharam Tej: వర్థమాన సినీనటుడు సాయిధరమ్ తేజ్(Sai dharam Tej) రోడ్డు ప్రమాదానికి గురై రెండు వారాలు దాటింది. ఏం ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నా అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నా ఇంతవరకు ఎందుకు డిశ్చార్జి చేయలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు చిన్న సర్జరీ అవసరమైందని తెలుస్తోంది. కానీ ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉండడంతోనే పరిస్థితి ఏంటనే దానిపై సందేహాలు వస్తున్నాయి.

అయితే రోజురోజుకు తేజ్ ఆరోగ్య స్థితిపై సమాచారం అందుతోంది. కానీ నిన్న తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Republic pre release Event) కు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ తేజ్ ఇంకా కోమాలో ఉన్నట్లు కామెంట్ చేయడం అందరిలో అనుమానాలు వస్తున్నాయి. చిన్న గాయాలే అని చెప్పినా ఇన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండడంతో అందరికి అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని హెల్త్ బులెటిన్ సూచిస్తున్నా ఒకింత అనుమానం కలుగుతోంది. మరోవైపు పవన్ కల్యాణ్ తేజ్ ఇంకా కోమాలో ఉన్నాడని చెప్పడంతో కంగారు మొదలైంది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని చెబుతోంది. దీంతో త్వరలో ఆయన డిశ్చార్జి కావచ్చని సూచనప్రాయంగా చెబుతున్నారు.
మరో వైపు పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాటల్లో కూడా భావోద్వేగం కనిపించడంతో అభిమానులు ఏదో జరుగుతుందని భావిస్తున్నారు. కానీ వైద్యులు మాత్రం తేజ్ ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలు వద్దని సూచిస్తున్నారు. త్వరలో ఆయన ఇంటికి సురక్షితంగా వెళతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తేజ్ ఆరోగ్యంపై ఓ క్లారిటీ వచ్చినట్లయింది.