Rajinikanth Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. దర్శకుడు నెల్సన్ తెరకెక్కించారు. నిన్న ట్రైలర్ విడుదల కాగా ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ట్రైలర్ లో యాక్షన్ అంశాలు హైలెట్ గా ఉన్నాయి. రజినీకాంత్ రోల్ ఆసక్తి రేపింది. గవర్నమెంట్ ఉద్యోగం నుండి రిటైర్ అయిన రజినీకాంత్ ఫ్యామిలీ మాన్ గా కుటుంబంతో ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటాడు. అనుకోని ఉపద్రవం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఒక సామాన్యుడైన రజినీకాంత్ మాఫీయా మీద తిరబడతాడు.
సాదాసీదా అనుకున్న వ్యక్తి సృష్టించే విధ్వసం అందరి మైండ్స్ బ్లాక్ చేస్తుంది. జైలర్ ట్రైలర్ ఆధారంగా అంచనా వేస్తున్న కథ ఇదే. ఈ క్రమంలో జైలర్ ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అంటూ ప్రచారం జరుగుతుంది. 2001లో నోబడి టైటిల్ తో అమెరికన్ మూవీ విడుదలైంది. ఈ చిత్ర కథ కూడా ఇలానే ఉంటుంది. తన కుటుంబంతో ప్రశాంత జీవనం గడుపుతున్న సాదాసీదా వ్యక్తి రష్యన్ మాఫియాతో తలపడతాడు. వాళ్లకు చుక్కలు చూపిస్తాడు.
ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన నోబడి భారీ విజయం సాధించింది. నోబడి చిత్ర కథకు చిన్న చిన్న మార్పులు చేసి జైలర్ మూవీ చేశారనే ప్రచారం మొదలైంది. సినిమా చూడకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని రజినీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఆగస్టు 10 వరకు ఎదురు చూడాల్సిందే.
జైలర్ మూవీలో రజినీకాంత్ కి జంటగా తమన్నా నటిస్తుంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ కీలక రోల్స్ చేస్తున్నారు. రమ్యకృష్ణ రజినీకాంత్ భార్య రోల్ చేస్తున్నారు. జైలర్ మూవీలోని కావాలయ్యా సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సన్ పిక్చర్స్ జైలర్ చిత్రాన్ని తెరకెక్కించారు. అనిరుధ్ సంగీతం అందించారు.