Rajamouli Next Film: దేశం గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించడంతో అపజయం ఎరుగని దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో ఆయనను మించిన దర్శకులు మరెవరు లేరు అనేది ప్రూవ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని రాజమౌళి ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ప్రస్తుతం రాజమౌళి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసినప్పటికి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో మాత్రం సినిమాలు చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసినప్పటికి అది అనుకోని కారణాలవల్ల మెటీరియలైజ్ అవ్వలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ట్రై చేశాడు. కానీ అల్లు అర్జున్ తో మాత్రం సినిమా ఊసే ఎత్తడం లేదు.
ఎందుకని రాజమౌళి మిగతా స్టార్ హీరోలందరితో సినిమా చేసి అల్లు అర్జున్ ని మాత్రమే పక్కన పెడుతున్నాడు అంటూ చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. రాజమౌళి హీరోలు అంటే దేనికైనా ఓర్చుకొని హార్డ్ వర్క్ చేసేలాగా ఉండాలి. ఇక రాజమౌళికి అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేసినప్పటికి తను మాత్రం అల్లు అర్జున్ మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు.
ఇక అల్లు అర్జున్ అభిమానులైతే రాజమౌళి బన్నీ తో సినిమా చేయకుండా అతన్ని అవమానిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను అందుకొని స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వస్తే అది ఎప్పుడు రావచ్చు అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…