Rajamouli: రీసెంట్ గా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ‘వారణాసి'(Varanasi Movie) మూవీ ఈవెంట్ లో రాజమౌళి(SS Rajamouli) దైవం పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగు పులుముకుంది. ఎట్టి పరిస్థితిలోనూ రాజమౌళి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని, లేదంటే ఆయన సినిమాలను విడుదల కానివ్వము అంటూ పెద్ద ఎత్తున వార్ణింగ్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులూ రోజుకు ఒకరు మీడియా ముందుకొచ్చి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయాలకు ఎలాంటి రాజమౌళి దూరం గా ఉన్నప్పటికీ కూడా, బీజేపీ పార్టీ ఇంత సీరియస్ గా ఆయన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యింది అంటే, రాబోయే రోజుల్లో ఈ వివాదం నార్త్ ఇండియా వరకు ఎగబాకే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాజమౌళి పై ఒక కేసు నమోదు అయ్యింది.
రాబోయే రోజుల్లో ఆయనపై మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే రాజమౌళి ని కచ్చితంగా రిమాండ్ లోకి తీసుకొని విచారించాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్ ని అరెస్ట్ చేసిన ప్రభుత్వం, రాజమౌళి ని అరెస్ట్ చెయ్యదు అంటే నమ్మలేం. జనాల నుండి వ్యతిరేకత తీవ్రంగా ఎదురైతే, కచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇంత రచ్చ జరుగుతున్నా కూడా రాజమౌళి నోరు మెదపకపోవడం నిజంగా ఆయన అహంకారానికి ప్రతిరూపం గా నిలుస్తున్నాడు అనుకోవచ్చు. ఆయన దేవుడిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది ఆయన ఇష్టం, కానీ కోట్లాది మంది జనాల మనోభావాలను, నమ్మకాలను దెబ్బ తీసే అర్హత ఆయనకు లేదు. పైగా ఆయన సినిమా తీసి డబ్బులు చేసుకోవాలని అనుకుంటున్నది దేవుడి ని ఉపయోగించుకునే. గ్లింప్స్ తో ఈ విషయాన్నీ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఆయన దేవుడి పట్ల ఇంత అహంకారం తో వ్యవహరిస్తే కచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు.
కేవలం ఒక్క గ్లింప్స్ వీడియో తానూ ఏర్పాట చేయించిన 150 అడుగుల ఎత్తుగల LED వీడియో లో ప్లే అవ్వడం ఆలస్యం అయ్యిందని దేవుడు లేడంటూ వ్యాఖ్యానించిన రాజమౌళి కి, అదే దేవుడు కెరీర్ లో తిరుగులేని విజయాలను అందించాడు, అంతర్జాతీయ స్థాయి కీర్తి ని ఇచ్చాడు, అందుకు రాజమౌళి ఎప్పుడైనా దేవుడికి కృతఙ్ఞతలు చెప్పాడా?, లేదు కదా?, అలాంటిది లక్షలాది మంది చూస్తున్న ఒక ఈవెంట్ లో చిన్న విషయానికి దేవుడిని నిందించడం ఎంత వరకు కరెక్ట్ ?..పోనీ పొరపాటున నోరు జారాడు, క్షమాపణలు చెప్పాడా?, అది కూడా లేదు..అంటే దీని అర్థం ఏంటి?, నేను ఎలాంటి సినిమా తీసిన జనాలు చూస్తారు, నేను దేవుడిని నమ్మలేదు, టాలెంట్ ని నమ్మాను అనే యాటిట్యూడ్ తో ఉన్నాడా?, అదే కనుక నిజమైతే, రాజమౌళి పతనం ఆరంభం అయ్యినట్టే.