Andhra King Taluka Movie Review: ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ పోతినేని(Ram Pothineni) హీరో గా నటించిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇష్మార్ట్’ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. మాస్ సినిమాలు ఎందుకో రామ్ కి ఈమధ్య అసలు కలిసి రావడం లేదు. ఆయన మార్కెట్ పాపం ప్రమాదం లో పడిపోయింది. గతం లో కూడా ఇంతే, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు పడుతున్న సమయం లో ‘నేను శైలజ’ వంటి కూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు కూడా రామ్ అదే ఫార్ములా ని అనుసరిస్తున్నాడు. ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు మహేష్ బాబు రామ్ తో ‘ ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Movie) అనే చిత్రం చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది మీడియా ప్రముఖులకు వేసి చూపించారట. వాళ్ళ నుండి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ హీరో ని విపరీతంగా అభిమానించే ఒక అభిమాని, అభిమానులను దైవం గా భావించే హీరో కి మధ్య జరిగే స్టోరీ ఇది.
తన అభిమాని గొప్పతనం తెలుసుకొని, అతని కోసం వెట్టుకుంటూ వచ్చే హీరో పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అద్భుతంగా నటించాడని టాక్. ఇక హీరో రామ్ లో అయితే నేటి తరం యువత తమని తాము వెండితెర మీద చూసుకున్నట్టు అనిపించిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా, ఒక క్యూట్ లవ్ స్టోరీ లాగా ఈ సినిమా సాగిపోతుంది అట. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఇంటెన్స్ గా, ఎమోషనల్ గా ఉండబోతుంది అట. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని చూసి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అవ్వుద్దని అంటున్నారు. అంతలా క్లైమాక్స్ లో ఏమి పెట్టారో తెలియాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే.