https://oktelugu.com/

Pushpa 3 : పుష్ప 3 లో ఈ ఒక్క సీన్ తో పుష్పరాజ్ ర్యాంపేజ్ ఏంటో చూపించబోతున్నాడా..? ఈ సీన్ ముందు ప్రశాంత్ నీల్ కూడా పనికిరాడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు..

Written By:
  • Gopi
  • , Updated On : December 20, 2024 / 09:31 AM IST

    Pushpa 3

    Follow us on

    Pushpa 3 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు…ఇక ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాదించబోయే విజయాలు మరొకెత్తనే చెప్పాలి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ భారీ సక్సెస్ లను సాధించే దిశగా ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక పుష్ప 2 మూవీ ఇప్పటివరకు 1700 కోట్ల కలెక్షన్లను రాబట్టి బాహుబలి రికార్డును బ్రేక్ చేసే దిశగా ముందుకు సాగుతుంది. మరి ఇప్పటికి కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లతో నడుస్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి రికార్డును కనక బ్రేక్ చేసినట్లైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధించిన సినిమాగా పుష్ప 2 సినిమా చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి… ఇక పుష్ప 2 సినిమాలో మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఎలివేషన్ తో నింపేసిన సుకుమార్ ‘పుష్ప 3’ సినిమాని కూడా అలాగే తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే టీజర్ ని మనకు చూపించారు. ఇక ఆ టీజర్ పార్ట్ 3 లో రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక దాన్ని కనక మనం బాగా అబ్జర్వ్ చేసినట్లైతే ఆ టీజర్ పుష్ప 3 టీజర్ గా మనకు తెలుస్తోంది. అయితే పుష్ప 3 లో పుష్పరాజ్ అన్నింటిని కోల్పోయి ఎవ్వరికీ కనిపించకుండా కొద్దిరోజుల పాటు అజ్ఞాతానికి వెళ్ళిపోతారట. మరి ఆ అజ్ఞాత నుంచి బయటికి వచ్చినప్పుడు పులి సైతం పుష్ప ను చూసి భయపడిపోతుంది.

    అలాగే చాలామంది రౌడీలు సైతం అతన్ని చూసి కంగుతినేలా ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట. మరి ఆ యాక్షన్ ఎపిసోడ్ ని ఇంకా షూట్ చేయలేదు. కానీ ఆ ఎలివేషన్స్ ను మాత్రం ఇంతకుముందే సుకుమార్ షూట్ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఎలివేషన్స్ ను చూస్తే మాత్రం వీటి ముందు ప్రశాంత్ నీల్ కూడా పని చేయడనే వార్తలైతే వస్తున్నాయి… ఇక ఈ సినిమా 2027 లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించి సూపర్ సక్సెస్ చేసి ముందుకు తీసుకెళ్లాలని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది…

    ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతుంది. కాబట్టి పుష్ప 3 ని కూడా రంగంలోకి దించే ప్రయత్నంలో ప్రొడ్యూసర్స్ అయితే ఉన్నారు. మరి అల్లు అర్జున్ కూడా ఇప్పుడు బిజీగా ఉండడం వల్ల వాళ్ల ప్రాజెక్టుల మొత్తం పూర్తయిన తర్వాత సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది…