Identity Full Movie Review : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు మినిమం గ్యారంటీగా ఉండడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే కొత్త కాన్సెప్టులతో సినిమాలను చేయడంలో వీళ్లను మించిన వారు ఇండియాలో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక గత సంవత్సరంలో ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీల కంటే అత్యధిక శాతం సక్సెస్ రేట్ ను కలిగి ఉన్న సినిమా ఇండస్ట్రీ కూడా మలయాళ ఇండస్ట్రీ నే కావడం విశేషం…
దాదాపు 40% సక్సెస్ రేట్ తో ముందుకు సాగుతుంది. మరి ఇదిలా ఉంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే కొన్ని మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘ఐడెంటిటి’ అనే మూవీ ఒకటి. ఇందులో వినయ్ రాయ్, త్రిష, టొవినో థామస్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళ వెర్షన్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే హరన్ శంకర్ (టొవినో థామస్) తన చిన్నతనం లోనే తల్లిని కోల్పోతాడు…ఇక తండ్రి ఉన్న కూడా ఒక్కరోజు కూడా తన మీద ప్రేమ చూపించాడు. పైగా ఆయన పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ ను ఫాలో అవ్వకపోతే మాత్రం భారీ శిక్షలు విధిస్తాడు…ఇక ఇదిలా ఉంటే టొవిని థామస్ బాగా చదువుకొని ఎన్ ఎస్ జి కమండో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు…ఇక ఆ తర్వాత స్కై మార్షల్ గా మారుతాడు. ఇక ఇదిలా ఉంటే అలెన్ జాకోబ్ (వినయ్ రాయ్)…ఇక ఇదిలా ఉంటే ఒక యాక్సిడెంట్ లో అలిషా (త్రిష) మొహాలను గుర్తుపట్టడం లో ఇబ్బంది పడుతుంది. ఇక ఆ యాక్సిడెంట్ కేస్ లో ఏం జరిగింది అలెన్ జాకోబ్ ఎవరు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకులు అఖిల్ పాల్ – అనాస్ ఖాన్ ఇద్దరు కలిసి దీనిని చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొదట్లో సినిమాని క్యూరియాసిటీతో ముందుకు తీసుకెళ్లినప్పటికి చాలా ఎక్సైటింగ్ గా సినిమాని తీర్చిదిద్దారు. కానీ సెకండ్ ఆఫ్ లో మాత్రం అక్కడక్కడ కొంతవరకు వీళ్ళు తరబడ్డారనే చెప్పాలి. అయితే స్క్రీన్ ప్లే గ్రిప్పింగా లేకపోవడం వల్లే ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంట్రాగేషన్ అనేది చాలా ఇంటెన్స్ తో సాగాలి అలా కాకుండా నార్మల్ గా ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ మెథడ్ అనేది ఇంకొంచెం బెటర్ మెంట్ చేసి ఉండి, అలాగే కథలో కాన్ఫ్లిక్ట్ ఇంకా టైట్ గా తీసుకొని వస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయి ఉండేది… ఇప్పటికైనా కూడా ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారు. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని మిస్టెక్స్ ను మినహాయిస్తే సినిమా ఓవరాల్ గా సగటు ప్రేక్షకుడు చూసే విధంగా అయితే ఉంది. ఇక మ్యూజిక్ విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కొన్ని ఎమోషన్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఇక విజువల్స్ పరంగా కూడా ఈ సినిమాకి దర్శకుడు ఎలాంటి విజువల్స్ ను అయితే అనుకున్నాడో అలాంటి విజువల్స్ తీసుకురావడంలో వాళ్ళు కొంత వరకు సక్సెస్ అయ్యారు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నంతలో బాగానే అనిపించాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫమెన్స్ విషయానికి వస్తే టోవినో థామస్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. ఇంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటూ వస్తున్న ఆయన ఈ సినిమాలో కూడా తన మార్క్ యాక్టింగ్ అయితే చూపించాడు. త్రిష కూడా ఎక్కడ తగ్గకుండా ఒక డిసీజ్ తో బాధపడుతున్న లేడీ ఎలాంటి ఆక్టివిటీ అయితే అలవర్చుకుంటూ ముందుకు సాగుతుందో అలాంటి ఒక ఆక్టివిటీతో యాక్టింగ్ చేస్తూ ఆమె ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… వినయ్ రాయ్ కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ల యాక్టింగ్ తో సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యారనే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ చాలా మంచి మ్యూజిక్ ని అందించాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక విజువల్స్ విషయంలో కూడా సినిమాటోగ్రాఫర్ అఖిల్ జార్జ్ చాలా మంచి విజువల్స్ ని అందించే ప్రయత్నం చేశాడు. అందువల్లే సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా ముందుకు సాగే విధంగా ఈ సినిమా ఉంది…
ప్లస్ పాయింట్స్
కథ
లీడ్ ఆర్టిస్టుల పర్ఫామెన్స్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
అనవసరపు సీన్స్
స్లో నేరేషన్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5