Prabhas: ప్రభాస్.. ఈ పేరు వింటేనే టాలీవుడ్ టాప్ హీరో అంటారు. అంతేకాదు తెలుగు సినిమా రేంజ్ ను పెంచిన హీరో. టాలీవుడ్ హీరో నుంచి బాలీవుడ్ హీరోలకు పోటీగా నిలిచి.. వారికంటే ఒక అడుగుముందుగా ఉన్న హీరో కూడా ప్రభాస్ అని చెప్పడంలో సందేహం లేదు. ఒకప్పుడు సౌత్ సినిమాలకు పెద్దగా ఆదరణ లేదు. అంతేకాదు చిన్న చూపు చూసేవారు కూడా ఎక్కువగా ఉండేవారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలను చూసి భయపడుతున్న వారు ఎందరో.. అయితే ఈ రేంజ్ లో తెలుగు సినిమాలకు ఆదరణ లభించింది అంటే అందులో మొదటి ప్లేస్ ఉంటారు ప్రభాస్.
బాహుబలి సినిమాతో తన రేంజ్ ను పెంచుకున్న ప్రభాస్.. సలార్ సినిమాతో అంతకు మించి అనేట్టుగా ఎదిగారు. దీంతో బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోలు అయిన ఖాన్ హీరోలు భయపడేలా చేశారు. సలార్ డూపర్ సూపర్ సక్సెస్ తో అందరిని భయపెడుతున్న హీరోగా ఎదిగాడు డార్లింగ్. తెలుగు వాళ్లని చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ వల్ల ముక్కున వేలు వేసుకోవడమే కాదు.. సినిమాలంటే సౌత్ ఇండియా సినిమాలే అనేట్టుగా చేశారు. బాహుబలి, సలార్, ఆర్ఆర్ఆర్ సినిమాలు మన తెలుగు సినిమా సత్తాను పెంచాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అయితే పాన్ ఇండియా సినిమాల్లో స్టార్ హీరోలందరికంటే ప్రభాస్ ఎక్కువ నటించారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2, ప్రస్తుతం సలార్ ఈ మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ఇండియా మొత్తం ఈయనకు అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం పూర్తైంది. మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డారట అశ్విన్. దీంతో ప్రభాస్ మళ్లీ బిజీ అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ రేంజ్ లో ఉండబోతుందట. ఇక ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే ఆయన రేంజ్ ను ఆపడం ఎవరి వల్ల కాదు. అందరిని మించి ప్రపంచంలోనే స్టార్ హీరోగా ఎదుగుతారని ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి చూడాలి ప్రభాస్ లైఫ్ ఎలా ఉండనుందో…