Spirit
Spirit : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ హీరో మరొకసారి తను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగా సందీప్ రెడ్డివంగా(Sandeep reddy vanga) దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హనుమ రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమా సెట్స్ మీద నేపధ్యం లో తన తదుపరి సినిమాని సందీప్ వంగతో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ (Spirit) సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఇప్పటికే సందీప్ ఆ సినిమా స్టోరీ ని లాక్ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా కనక బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కితే ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ ప్రభాస్ కి ఒక కొత్త ఇమేజ్ ని ఇవ్వడమే కాకుండా ఆయన లోని కొత్త యాంగిల్ ను కూడా మనం చూడగలుగుతాము. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ మూగవాడిగా నటించబోతున్నాడనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది తెలుసుకున్న చాలామంది సందీప్ రెడ్డివంగా అభిమానులు ప్రభాస్ అభిమానులు సైతం సందీప్ రెడ్డి వంగ తన హీరోని మూగవాడిగా చూపిస్తున్నాడా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి సినిమా మొత్తం ప్రభాస్ మూగవాడిగా నటించడం లేదు. ఆయన అండర్ కవర్ ఆపరేషన్ చేసినప్పుడు అందులో ఒక ఐదు నిమిషాల పాటు మూగవాడి గా నటిస్తాడట…కొద్దిసేపు అలా ఏమీ మాట్లాడకుండా మూగవాడిగా చేసి కొంతమంది క్రిమినల్స్ ను పట్టుకునే ఒక సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగా సినిమాలో హీరో అంటే భారీ డైలాగులు చెప్పకపోయినా వాళ్ళ డైలాగులతో ప్రేక్షకులను మెప్పిస్తు ఉంటారు. అలాగే హీరో కొన్ని బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ హీరో నుంచి వచ్చినప్పుడే ఆడియన్స్ కి క హై మూమెంట్ అయితే ఉంటుంది.
కాబట్టి పూర్తిగా ఈ సినిమాలో మూగవాడిగా నటించడం లేదు. కానీ ఒక చిన్న ఆపరేషన్ చేయడానికి జస్ట్ అలా ఆక్ట్ మాత్రమే చేస్తారట. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి మ్యాజిక్ ను చేయబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…