Pawan Kalyan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ లాంటి పదాలు వినిపిస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్టు మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా, ఆయనకీ వచ్చే ఓపెనింగ్స్ పాన్ ఇండియన్ హీరోలుగా పిలవబడుతున్న చాలా మంది హీరోస్ కి రావు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కూడా యాక్టీవ్ గా ఉన్నాడు.
ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు అంటే కచ్చితంగా అధికార ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన గత రెండు చిత్రాలైన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ ని ఇలాగే ఇబ్బంది పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ వల్ల ఈ రెండు సినిమాలు నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి ఎలాంటి నష్టం కూడా కలిగించలేదు.
అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ముమ్మిడివరం బహిరంగ సభలో టాలీవుడ్ హీరోల పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళకంటే నేను తక్కువ అని చెప్పడం యావత్తు సినీ లోకాన్ని ఆశ్చర్యపొయ్యేలా చేసింది. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా, బహిరంగ సభలో ఇలా మాట్లాడడానికి కూడా కారణం ఉందని అంటున్నారు. సోషల్ మీడియా లో ఉండే పవన్ కళ్యాణ్ అభిమానులు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయం లో కొంతమంది స్టార్ హీరోల అభిమానులతో గొడవ పడుతుంటారు. ఇదంతా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిందట.ఆయన అందుకే ప్రతీ సభలో ఇతర స్టార్ హీరోల పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళ సప్పోర్టుని జనసేన పార్టీ కోసం కోరుకుంటున్నాడు.
ఇది ఇతర హీరోల అభిమానులకు బాగా నచ్చింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా బాగా నచ్చింది, కానీ నిన్న ఆయన అందరికంటే తనని తాను తగ్గించుకొని మాట్లాడడం మాత్రం అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ చెయ్యడం వల్లే పవన్ కళ్యాణ్ ఇలా బహిరంగంగా తనని తాను తగ్గించుకున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికైనా ఫ్యాన్ వార్స్ ఆపుతారో లేదో చూడాలి.