NTR War 2 Effect: ఒక సినిమా సక్సెస్ అయితే ఆ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపైతే వస్తుంది… ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాలో నటించిన హీరో దగ్గర నుంచి సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా చాలావరకు విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు… మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకుడు ఒక కథను రాసుకున్నప్పుడు దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ముందుగానే డిసైడ్ చేసుకొని ఏ సన్నివేశాలు హైలెట్ కాబోతున్నాయో వాటి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని మరి వాటిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ప్రతి ఒక్క సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇవన్నీ పర్ఫెక్ట్ గా చూసుకుంటూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుసగా 7 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సక్సెస్ ల ఊపు లో ఉన్నాడు కదా ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా మంచి సక్సెస్ లనునందుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఆయన చేసిన వార్ 2 సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Also Read: అఖండ 2 మూవీని పోస్ట్ పోన్ చేయబోతున్నారా..?కారణం ఏంటంటే..?
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. తన అభిమానులు సైతం ఈ సినిమాను చూసి దీని మీద నెగెటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ తన టీమ్ అందరినీ పిలిచి తను నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పకడ్బందీ ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇకమీదట చేయబోయే సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచే సినిమాలైతేనే మనం ఒప్పుకోవాలని అలాంటి కథలతో ఉన్న వాళ్ళని మాత్రమే తన దగ్గరికి తీసుకురమ్మని మిగతా దర్శకులు ఎవరు వచ్చినా కూడా నో చెప్పమని ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా మీదనే అతని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తోంది. తద్వారా ఎన్టీఆర్ కెరియర్ ని ముందుకు తీసుకెళ్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…