Peddi movie negative publicity: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరికెక్కిన పెద్ది సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమాను చూసిన చాలామంది ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించినప్పటికి సెకండాఫ్ చాలా ఎమోషనల్ గా ఉందని సినిమా సగటు ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి భారీ సక్సెస్ ని కొల్లగొట్టడమే కాకుండా భారీ కలెక్షన్స్ కూడా రాబడుతుందనే ఉద్దేశంతో మేకర్స్ అయితే మొదటి నుంచి పాజిటివ్ గానే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి కొన్ని ఏరియాల్లో మిక్స్డ్ టాక్ వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక కావాలనే కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ మరి కొంతమంది మెగా అభిమానులు సైతం వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతకుముందు చాలామంది హీరోలు వాళ్లు చేసిన సినిమాలు మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నా కూడా దానికి నెగెటివ్ ప్రచారం చేయడం అనేది అందరికి అనవాయితిగా మారిపోయింది.
రామ్ చరణ్ గత సినిమా అయిన గేమ్ చేంజర్ సినిమాకి సైతం ప్రీమియర్ షోస్ నుంచే నెగెటివ్ ప్రచారం చేశారు. మొత్తానికైతే ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. మరి పెద్ది సినిమా విషయంలో కూడా అలాంటి వైఖరిని అనుసరిస్తున్నారు. అయినప్పటికి ఈ సినిమా మౌత్ టాక్ తో దూసుకెళ్తుంది నిన్న నైట్ ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా మీద చాలామంది పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.
కానీ కొంతమంది కావాలనే నెగెటివ్ గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్లకి ఏం వస్తుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇక ఇదంతా చూస్తున్న సినిమా మేధావులు సైతం రామ్ చరణ్ మూవీ రిలీజ్ అవ్వగానే కొంతమంది స్టార్ హీరోలు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు…
