https://oktelugu.com/

Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ తో మైత్రి ప్రొడ్యూసర్స్ గొడవకి నాగ చైతన్య కారణమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 28, 2024 / 02:23 PM IST

    Devi Sri Prasad

    Follow us on

    Devi Sri Prasad : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు…నిజానికి ఒక సినిమా సక్సెస్ లో డైరెక్టర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కీలక పాత్ర వహిస్తాడు. కథ డైరెక్షన్ ఎంత బాగున్నా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుండాలి. లేకపోతే మాత్రం సినిమా మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే మాత్రం మ్యూజిక్ అనేది కీలకపాత్ర వహిస్తుంది…

    ఇక పుష్ప 2 సినిమా మీద కాంట్రవర్సీల మీద కాంట్రవర్సీలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ మీద విపరీతమైన కోపంతో ఉన్నాడనే విషయాన్ని రీసెంట్ గా ఒక ఈవెంట్ లో తెలియజేశాడు. మరి దానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కి కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ మధ్య వివాదాలు రావడానికి గల కారణం ఏంటి అంటే దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది అతను ఆ సినిమా మీద ఎక్కువగా టైం అయితే కేటాయించలేకపోయాడట. ఎందుకంటే తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో ఆ సినిమా మీద తను ఎక్కువగా ఫోకస్ చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దాంతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఆ సినిమా నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చేయడానికి ఆ సినిమాకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో తను పుష్ప 2 సినిమాకి ఇవ్వాల్సిన టైమ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆయన ప్లేస్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి తమన్ ను తీసుకొచ్చారు.

    ఇక దాంతో దేవిశ్రీప్రసాద్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు… ఇక దీనికంతటికి కారణం అక్కినేని వారసుడు అయిన నాగచైతన్య అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు అంటే తండెల్ సినిమా నుంచి తమకు అర్జెంటుగా ఒక సాంగ్ రిలీజ్ చేయాలి అంటూ దేవిశ్రీప్రసాద్ ని పోర్స్ చేయడంతో దేవి ఆ సినిమా మీద కొంత సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. తద్వారా పుష్ప 2 సినిమాను నిర్లక్ష్యం చేశాడు.

    అందువల్లే వీళ్ళ మధ్య తగాదాలు రావడంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకొచ్చి పెట్టే అంతగా వాళ్ళ ఇగోలు హర్ట్ అయ్యాయి అంటూ కొంతమంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఒకరికి ఒకరు సహకారం చేసుకుంటూ ముందుకు సాగితేనే సినిమా అనేది సక్సెస్ ఫుల్ గా సాగుతుంది అంతే తప్ప ఇగో లకు పోయి నిర్లక్ష్యం చేస్తే మాత్రం సినిమా ఫలితం మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి…