https://oktelugu.com/

Sandeep Reddy Vanga : అట్లీ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ వీళ్లలో పాన్ ఇండియాలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల మధ్య మంచి పోటీ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : November 28, 2024 / 02:28 PM IST

    Sandeep Reddy Vanga

    Follow us on

    Sandeep Reddy Vanga : సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల మధ్య మంచి పోటీ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్న దర్శకుల మధ్య విపరీతమైన పోటీ ఉంది. సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ డైరెక్టర్లు గా కొనసాగుతున్న వాళ్లలో ఎవరి సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే దానిమీద చాలా వరకు పోటీ అయితే ఉంది…

    రాజా రాణి సినిమాతో తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అట్లీ…ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా దర్శకుడి గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు పాన్ ఇండియాలో మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఆ ధోరణిలోనే ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ తో ఒక భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే తన రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైన పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. ఈయన తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అనిమల్ సినిమాతో బాలీవుడ్ లో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన 900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ మేనియాని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో దాదాపు 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అట్లీ సందీప్ రెడ్డి వంగ ఇద్దరి మద్య మంచి పోటీ అయితే ఉంది.

    ఇక వీళ్లిద్దరూ సినిమా తీసే విధానం కానీ, ప్రేక్షకులను అలరించే నైపుణ్యం లో గాని, ఒకరికి ఒకరు సమఉజ్జీలుగా పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకొని ఎవరికి వారే ప్రత్యేకమైన శైలిని కలిగి ఉన్నారు. అలాగే సినిమాలు తీయడంలో కూడా ఒకరు కమర్షియల్ ఫార్మాట్ ని ఎంచుకొని ముందుకు సాగుతుంటే మరొకరు బోల్డ్ కంటెంట్ తో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

    అయితే వీళ్ళిద్దరి మధ్య తలెత్తుతున్న పోటీలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారనే విషయాన్ని కరెక్ట్ గా చెప్పడం చాలా కష్టం… ఎందుకంటే ఒకరి సినిమా ఒక సమయంలో భారీ విజయాన్ని సాధిస్తే మరొకరి సినిమా ఇంకో సమయంలో భారీ కలెక్షన్స్ ను రాబడుతున్నాయి.

    కాబట్టి మరో రెండు మూడు సంవత్సరాలు గడిస్తే తప్ప వీళ్ళలో ఎవరు టాప్ డైరెక్టర్ అనేది చెప్పడం కష్టతరమవుతుంది. ఇక ఇప్పుడున్న సిచువేషన్ కొనసాగిస్తూ కంటిన్యూస్ గా ఎవరైతే సక్సెస్ లను సాధిస్తారో వాళ్ళు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…