Bigg Boss Telugu 9 : ఎల్లుండి నుండి జియో హాట్ స్టార్ లో బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అగ్ని పరీక్ష'(Agnipareeksha) షో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోకి సంబంధించి ఇప్పటికే మనం ఎన్నో విన్నాము. ఇప్పుడు ప్రోమోల ద్వారా కళ్లారా చూస్తున్నాము. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ షేడ్స్ ఒక పక్క కనిపిస్తున్నాయి, మరో పక్క బిగ్ బాస్ షో లో ఉన్న ఫైర్ కూడ కనిపిస్తుంది. మొత్తానికి ఈ అగ్ని పరీక్ష షో స్ట్రీమింగ్ అయ్యాక బంపర్ హిట్ అవుతుందని ప్రోమోలను చూస్తుంటే అందరికీ అర్థం అవుతుంది. అయితే ఈరోజు ఉదయం విడుదల చేసిన ప్రోమో లో మాస్క్ సృష్టించిన భీభత్సం మనమంతా చూశాము. అతి మాములుగా లేదు, ఇతను బిగ్ బాస్ 9 కి ఎంపిక కూడా అయిపోయాడట, ఇక చేసేదేమి లేదు, ఇతని ఓవర్ యాక్షన్ ని మనమంతా భరించాల్సిందే.
అత్తని సంగతి కాసేపు పక్కన పెడితే కాసేపటి క్రితమే ఒక ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో ఒక లేడీ కంటెస్టెంట్ జడ్జి అభిజీత్ పై చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రోమో మొత్తం చాలా ఫన్నీ గా వెళ్ళింది, కానీ చివర్లో మాత్రం ఈ ట్విస్ట్ పెద్ద దుమారమే రేపింది. అభిజిత్ అభిమానులు ఆ కంటెస్టెంట్ పై మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన ఆరోపణలు ఏమిటంటే ‘నా మొదటి నామినేషన్ అభిజిత్. సాధారణంగా ఆయన ఫోకస్ గేమ్ కంటే వేరే కంటెస్టెంట్స్ మీద ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించింది’ అని అంటుంది. అక్కడితో ఈ ప్రోమో ని ముగించారు. ఈ అగ్నిపరీక్ష షూటింగ్ మొదలైనప్పుడు అభిజిత్ ఒక కంటెస్టెంట్ పై ఫైర్ అయ్యాడు, ఒక అమ్మాయి ఆరోపణలు చేసింది వంటివి విన్నాము కదా, బహుశా అది ఇదే అయ్యుండొచ్చు.
కానీ అభిజిత్ పై ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా విచిత్రం గా ఉందని, హౌస్ లో వంద రోజులు ఉంటే ఒక్కసారి కూడా ఆయన పై ఇలాంటి ఆరోపణలు రాలేదని ఈ ప్రోమో ని చూసిన నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే అక్కడ ఏమి జరిగిందో మనకి తెలియదు, ఆ అమ్మాయి ఎలాంటి సందర్భాలను చూసి అలా మాట్లాడిందో మనకి తెలియదు, కాబట్టి ఈ అంశం లో ఎవరు కరెక్ట్ అనేది తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే. ఇదంతా పక్కన పెడితే అసలు జడ్జీలను నామినేట్ చేయడం ఏంటి?, అసలు బిగ్ బాస్ టీం ఇలాంటి కోత కాన్సెప్ట్ ని ఎందుకు పెట్టాడు?, ఒకవేళ జడ్జీలలో అత్యధిక నామినేషన్స్ వచ్చిన వారిని ఏమి చేస్తారు వంటివి ఆసక్తికరంగా మారిన అంశాలు. చూడాలి మరి మొదటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది.