Director Maruthi: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. హీరోహీరోయిన్, నటుడు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇలా ఎంతో మంది కష్టంతోనే సినిమా సాగుతుంది. అయితే అందరు కూడా డైరెక్టర్ పైనే ఆధారపడుతుంటారు. ఆయన స్ట్కిప్ట్ పరంగానే సినిమా నడుస్తుంటుంది. ఈయనను నమ్మి ప్రొడ్యూసర్లు భారీ బడ్జెట్ ను పెడుతుంటారు. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ ను సాధించాయి. అయితే కొందరు నటీనటులు అవ్వాలి అనుకుంటే కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండాలనుకుంటారు.
ఇక చిన్న సినిమాలుగా వచ్చి భారీ హిట్ లను అందుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈ చిన్న సినిమాల హవాను మొదలుపెట్టిన వారిలో మారుతి ముందు వరుసలో ఉంటారు. 5d కెమెరాతో ఈ రోజుల్లీ అనే సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సక్సెస్ లను అందుకుంటూనే ఉన్నారు. కానీ ఈయన ఖాతాలో ఫ్లాప్ సినిమాల సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. అంతలా ఈయన సినిమాలు సక్సెస్ అవుతుంటాయి.
దాదాపు ఈ సినిమా వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈయన లాగానే కొందరు డైరెక్టర్లు చిన్న సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. భారీ బడ్జెట్ లేకున్నా.. ధైర్యం చేసి చిన్న సినిమాలతోనే మంచి కంటెంట్ తో వస్తూ భారీ విజయాలను అందుకునేలా కష్టపడుతున్నారు. ఇలాంటి వారందరూ కూడా మారుతిని ఆదర్శంగా తీసుకున్నవారే అనడంలో సందేహం లేదు.
రీసెంట్ గా #90 సినిమా డైరెక్టర్ ఆదిత్య హాసన్ కు కూడా ఒక స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందని టాక్. ఇలా వారిని వారు ఏదో ఒక చిన్న సినిమాతో, వెబ్ సిరీస్ లతో ప్రూఫ్ చేసుకుంటూ డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదిస్తున్నారు. అంతే కాదు స్టార్ హీరోల సినిమాలకు డైరెక్షన్ చేస్తున్నారు కూడా. ఆదిత్య హాసన్ లాంటి డైరెక్టర్లు ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కిస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. కానీ వీరందరికి మారుతినే ఆదర్శం అంటారు కొందరు నెటిజన్లు.