https://oktelugu.com/

Manchu Manoj: మంచు మనోజ్ సినీ కెరియర్ ఇక ముగిసినట్టేనా..?

ప్రస్తుతం ఆయన సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ అవి ఏవి కూడా కార్యరూపం దాల్చినట్టుగా కనిపించడం లేదు. కాబట్టి మనోజ్ సినీ కెరీయర్ ముగిసిపోయిందా అని అతని అభిమానులతో పాటు గా, సగటు ప్రేక్షకుడు కూడా అభిప్రాయపడుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2023 / 04:23 PM IST

    Manchu Manoj

    Follow us on

    Manchu Manoj: మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ మొదట్లో వరుసగా సినిమాలు చేస్తూ నటుడు గా యూత్ లో తనకంటూ ఒక మంచి పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన బిజినెస్ పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు…ఇక రీసెంట్ గా భూమా మౌనిక రెడ్డి ని రెండో పెళ్లి చేసుకోవడంతో ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా సెట్ అయినట్టుగా తెలుస్తుంది.

    ఇక ప్రస్తుతం ఆయన సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ అవి ఏవి కూడా కార్యరూపం దాల్చినట్టుగా కనిపించడం లేదు. కాబట్టి మనోజ్ సినీ కెరీయర్ ముగిసిపోయిందా అని అతని అభిమానులతో పాటు గా, సగటు ప్రేక్షకుడు కూడా అభిప్రాయపడుతున్నాడు.ఇక ఇదే సమయంలో మనోజ్ కొన్ని సినిమాలకు కమిట్ అయిపోయినప్పటికి అవి ఎప్పుడు సెట్స్ మీదకి వస్తాయనే దానిపైన క్లారిటీ ఉండడం లేదు.ఇక అప్పట్లో ఆయన సినిమాలకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లోకి వెళ్తాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ పొలిటిక్స్ లో కూడా తనకి ఇంట్రెస్ట్ లేనట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం మంచు మనోజ్ సినిమాల పరంగా ఆసక్తి చూపించట్లేదు అన్నట్టుగానే వార్తలు వస్తున్నాయి.

    తను బిజినెస్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే అటు సినిమాలని, ఇటు పాలిటిక్స్ ని పట్టించుకోలేక పోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక అప్పట్లో మనోజ్ చేసిన సినిమాల్లో బిందాస్, ఝుమ్మంది నాదం,వేదం లాంటి మంచి సినిమాలు ఉన్నాయి. అలాగే తనకి నటుడి గా మంచి పేరు అయితే వచ్చింది కానీ తను సడన్ గా సినిమాలు మానేయడం వెనక కారణం ఏంటి అనేది తెలీదు ఇక అప్పట్లో అహం బ్రహ్మస్మి అనే సినిమాని మొదలు పెట్టినప్పటికీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకపక్క వాళ్ళ అన్నయ్య మంచు విష్ణు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్తుంటే మనోజ్ మాత్రం ఇలా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉండడం పట్ల ఆయన అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…

    ఇక ఇది తెలిసిన ట్రేడ్ పండితులు సైతం మనోజ్ సినీ కెరియర్ ముగిసినట్టే అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఉందటరీ లో ఈ విధమైన మార్కెట్ లేదు కాబట్టి అతని సినిమాలు వచ్చినా చూసే వాళ్ళు ఎవరూ లేరు అంటూ మాట్లాడుతున్నారు…