https://oktelugu.com/

Jakkanna: ఆ విషయంలోనూ ‘జక్కన్న’ ట్రెండ్ సెట్టరే?

Jakkanna: దర్శకధీరుడు రాజమౌళి కేవలం సినిమాలతోనే కాకుండా ప్రమోషన్స్ విషయంలోనూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. సినిమాలను ఒంత ఒపిగ్గా చెక్కుతారో.. ప్రమోషన్స్ విషయంలోనూ అంతే స్టాటజీతో ముందుకెళుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ మూవీ ప్రారంభమైన రాజమౌళి సినీ జర్నీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’కు చేరుకుంది. సినిమా సినిమాకు వేరియన్స్ చూపిస్తున్న రాజమౌళి ప్రమోషన్స్ విషయంలోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అందుకే ‘రాజమౌళి’ సినిమాలు కొంచెం హిట్ టాక్ తెచ్చుకున్నా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2021 / 04:46 PM IST
    Follow us on

    Jakkanna: దర్శకధీరుడు రాజమౌళి కేవలం సినిమాలతోనే కాకుండా ప్రమోషన్స్ విషయంలోనూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. సినిమాలను ఒంత ఒపిగ్గా చెక్కుతారో.. ప్రమోషన్స్ విషయంలోనూ అంతే స్టాటజీతో ముందుకెళుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ మూవీ ప్రారంభమైన రాజమౌళి సినీ జర్నీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’కు చేరుకుంది.

    సినిమా సినిమాకు వేరియన్స్ చూపిస్తున్న రాజమౌళి ప్రమోషన్స్ విషయంలోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అందుకే ‘రాజమౌళి’ సినిమాలు కొంచెం హిట్ టాక్ తెచ్చుకున్నా భారీ కలెక్షన్లు రాబడుతూ ఉంటాయి. ‘బాహుబలి’ సిరీసులతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి ప్రమోషన్స్ తో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టాడు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

    ఇక జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ ను అదిరిపోయే రేంజులో  చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా విపరీతంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నారు. బాలీవుడ్లో ఇప్పటికే  ‘ఆర్ఆర్ఆర్’పై హైప్ క్రియేట్ అయింది.

    ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి ఎంత ఫోకస్డ్ గా ఉన్నాడో తాజాగా జరిగిన కొన్ని సంఘటనల ద్వారా అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ కన్నడ ప్రమోషన్స్ లో భాగంగా ఓ విలేకరి రాజమౌళిని ‘కేజీఎఫ్ హీరో యశ్‌తో మీరు సినిమా చేస్తారా అని అడిగారు?.. దీనికి ఆయన తనదైన శైలిలో స్పందించారు.

    ‘నేను కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాననుకోండి.. ఆ హీరోతో రాజమౌళి సినిమా అని హెడ్ లైన్ పెట్టి స్క్రోలింగ్ వేస్తారు. అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మరుగున పడిపోతుంది. కాబట్టి నేను మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పను. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కానివ్వండి. దానికి మంచి స్పందన రానివ్వండి. ఆ తర్వాత నా దగ్గరికి రండి మీ ప్రశ్నకు జవాబిస్తా’ అన్నారు.

    అలాగే ఓ విలేకరి రాజమౌళి తర్వాత సినిమా గురించి అడిగితే ‘మహేష్‌తో నా తర్వాతి సినిమా అని ఇంతకుముందే ప్రకటించాను.. ఇప్పుడు నా దృష్టంతా ‘ఆర్ఆర్ఆర్’ మీదే ఉంది.. ఈ సినిమా రిలీజయ్యే వరకు దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను.. దాని గురించి మాట్లాడను’ అంటూ తేల్చిపారేశారు.

    ‘ఆర్ఆర్ఆర్’ నిర్వహించిన ప్రతీ ప్రెస్ మీట్లోనూ రాజమౌళి ఈ సినిమా విషయం గురించి తప్పే ఇతర విషయాల గురించి పెద్దగా స్పందించలేదు. ‘ఆర్ఆర్ఆర్’ హీరోల కంటే ఆయనే ఎక్కువ లీడ్ తీసుకొని మరీ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. దీంతో జక్కన్న సినిమాలను తీయడంలోనే కాదు.. ప్రమోషన్స్ లోనూ ట్రెండ్ సెట్టరే అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. మిగతా దర్శకులు సైతం రాజమౌళి చూసి నేర్చుకోవాలని సినీప్రియులు సూచిస్తున్నారు.