Rajinikanth Last Film: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నటుడు రజినీకాంత్… బస్ కండక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టినప్పటికి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని హీరోగా మారి ఆ తర్వాత సూపర్ స్టార్ గా మారిన ఘనత కూడా తనకే దక్కుతోంది… రీసెంట్ గా ‘కూలీ’ సినిమాతో తన అభిమానులు డిసప్పాయింట్ చేసిన రజినీకాంత్ ఇప్పుడు నెల్సన్ డైరెక్షన్లో ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన పవర్ ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక రజనీకాంత్ ఏజ్ కూడా భారీగా పెరిగిపోతుండటంతో ఆయన తొందర్లోనే సినిమా ఇండస్ట్రీకి రిటైర్ మెంట్ ప్రకటించే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 అతనికి చివరి సినిమాగా మారబోతుందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇప్పటికే రజినీకాంత్ హెల్త్ కండిషన్స్ సరిగ్గా ఉండటం లేదని డాక్టర్లు సైతం చెబుతున్నారు. తనకి రిస్ట్ కావాలని చెబుతున్నా కూడా ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నిజానికి ఈ ఏజ్ లో కూడా రజినీకాంత్ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ప్రేక్షకులకు ఒక మంచి క్వాలిటీ సినిమాను అందించాలనే ఉద్దేశ్యంతో తీవ్రంగా ప్రయత్నం చేస్తూ మంచి సినిమాలను చేస్తున్నాడు.
తన చివరి శ్వాస వరకు సినిమాలకే పరిమితం అంటూ గతంలో రజనీకాంత్ చెప్పిన మాటలను ఇప్పుడు నిజం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు… ఇక జైలర్ 2 సినిమాలో రజనీకాంత్ కోసం స్పెషల్ గా నాలుగు ఫైట్లు డిజైన్ చేశారట. అందులో రజనీకాంత్ తన స్వాగ్ ను మరోసారి చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
కూలీ సినిమాలో లోకేష్ కనకరాజ్ నిరాశపరిచినట్టుగా ఈ సినిమాలో నెల్సన్ డిసప్పాయింట్ చేయడని ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుందని రజనీకాంత్ సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోందనేది. తద్వారా రజినీకాంత్ మార్కెట్ ఏ రేంజ్ లో విస్తరిస్తోందనేది…