https://oktelugu.com/

Junior NTR and Balayya : బాలయ్య రెండు సార్లు థియేటర్ లో చూసిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదేనా..? ఇన్ని రోజులు తెలియలేదుగా!

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఎన్టీఆర్, బాలయ్య బాబు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం.

Written By: , Updated On : January 8, 2025 / 05:10 PM IST
Junior NTR , Balayya

Junior NTR , Balayya

Follow us on

Junior NTR and Balayya : గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఎన్టీఆర్, బాలయ్య బాబు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘అన్ స్టాపబుల్ 4’ షో కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ‘డాకు మహారాజ్’ టీం తో బాలయ్య బాబు చేసిన చిట్ చాట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాబీ ఇండస్ట్రీ లో చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రవితేజ, వెంకటేష్ వంటి టాప్ హీరోలతో ఇప్పటి వరకు సినిమాలు చేసాడు. ఈ సందర్భంగా బాబీ ని వాళ్ళతో పని చేసిన అనుభూతి ఎలా ఉంది అని అందరి గురించి అడుగుతూ ఎన్టీఆర్ గురించి మాత్రం అడగడు. దీనికి ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యారు. ప్రతీసారీ అవకాశం దొరికినప్పుడల్లా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ని అవమానిస్తూనే ఉన్నాడని, ఇది మేము సహించబోమని, జనవరి 12 న విడుదల కాబోతున్న ‘డాకు మహారాజ్’ మూవీ చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ మూవీ టీం మొత్తం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ‘అక్కడ మీరు అనుకున్నంత సీన్ ఏమి జరగలేదు. కేవలం నేను దర్శకత్వం వహించిన సినిమా హీరోల గురించి మాత్రమే బాలయ్య బాబు గారు అడిగారు. కొన్ని సార్లు అన్ని కెమెరా ముందు జరగాలంటే కుదరదు. బ్రేక్ టైం లో మా మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. ‘జై లవ కుశ’ చిత్రం ఆయన ఎంతో ఇష్టమట. రెండు సార్లు ఆయన ఎవరికీ కనపడకుండా థియేటర్స్ కి వెళ్లి కూడా చూశాడట. ఈ మాట విన్న తర్వాత షాక్ కి గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు బాబీ. అంత బాగానే ఉంది కానీ ఉద్దేశపూర్వకంగా ఎందుకు అలా ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రశ్న ని పక్కకి తోసారు అనేదే ఇప్పటికీ అభిమానులకు అర్థం కావడం లేదు.

ఈ షోకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బీవీఎస్ రవి ని ట్యాగ్ చేస్తూ ఎన్టీఆర్ అభిమానులు బూతులు తిడుతున్నారు. కావాలని ఇలా చేసుంటే నువ్వు బయట తిరగలేవు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరి దీనికి ఆయన నుండి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది చూడాలి. అప్పటి వరకు సోషల్ మీడియా లో బాబాయ్, అబ్బాయి అభిమానుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి అనుకోవచ్చు. ఇకపోతే బాలయ్య బాబు నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రానికి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలయ్య స్టైల్ లో కాకుండా ఈసారి చాలా కొత్తగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ బాబీ చేసినట్టుగా అనిపించింది. చూడాలి మరి ఈ ప్రయత్నాన్ని నందమూరి అభిమానులు ఎంతమేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది.