Pawan Kalyan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ‘ఇళయ తళపతి’ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్…ఈయన చేసిన సినిమాలు తమిళంలో మంచి విజయాలను సాధిస్తాయి. ఇక ఆయన సినిమాలు తెలుగులో డబ్ అయినప్పటికీ ఇక్కడ ఆయనకు అంత మంచి గుర్తింపు అయితే రాలేదు. ఇక ఆయన చేసిన తుపాకీ సినిమాను మినహాయిస్తే, మిగితా ఏ సినిమాలు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వకపోవడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే విజయ్ అక్కడ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే ఆత్రుతతో ‘తమిళ వెట్రి కజగం’ అనే పార్టీని పెట్టి పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తమిళనాడు పాలిటిక్స్ కి సినిమా రంగానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు అక్కడ దాదాపు ఐదుగురు ముఖ్యమంత్రులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే తెలుగులో జనసేన పార్టీని పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న పవన్ కళ్యాణ్..
ఆ పార్టీని పెట్టి దాదాపు పది సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఆ పార్టీలో క్యాడర్ ని మాత్రం డెవలప్ చేసుకోలేకపోయాడు. ఇక దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ కూడా పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల ఆయన కెరీర్ కూడా పవన్ కళ్యాణ్ మాదిరిగానే మారుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక నిజానికి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నప్పుటికి తను ఏదో ఒకటి చేయాలని ధృడ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాడు. ఇక సీనియర్ నాయకులు పెద్దగా ఆయన పార్టీలోకి చేరడం లేదు.
ఎందుకంటే ఈ పార్టీలో చేరితే ఒకవేళ అధికారం లోకి వచ్చి పవన్ కళ్యాణ్ సిఎం అయిన కూడా దీంట్లో దోచుకోవడానికి వీలు ఉండదు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండే పార్టీలో మాత్రమే వాళ్ళు చేరుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇక మీదట పొలిటికల్ గా ఎలా రాణిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాధురిగానే విజయ్ రాజకీయ భవిష్యత్తు కూడా మారబోతుందా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…