Sanjay Dutt character in Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదల డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు అనుకున్నంత గా రాలేదు. కానీ ప్రతీ సినిమాకు చెప్పినట్టుగానే, ఈ సినిమాకు కూడా నిర్మాతలు వచ్చిన దానికంటే ఎక్కువ గ్రాస్ వచ్చినట్టు కాసేపటి క్రితమే సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజున 112 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కానీ ట్రేడ్ విశ్లేషకుల లెక్క ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా కేవలం 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. డివైడ్ టాక్ మీద ఈ మాత్రం రావడం గొప్పే. ఇక ఆ విషయం కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే ఇందులో ప్రభాస్ కి తాత గా, విలన్ క్యారక్టర్ లో సంజయ్ దత్(Sanjay Dutt) ఎంత బాగా నటించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రధానమైన హైలైట్స్ లో ఆయన క్యారక్టర్ కూడా ఒకటి. అయితే ఈ క్యారక్టర్ ని ముందుగా సంజయ్ దత్ తో చేయించాలని అనుకోలేదట. మన టాలీవుడ్ లో సీనియర్ హీరో గా పిలవబడే రాజశేఖర్ తో ఈ క్యారక్టర్ ని చేయించాలని అనుకున్నారట. ఆయనకు కూడా ఈ పాత్ర బాగా నచ్చింది, చెయ్యడానికి అంగీకారం కూడా తెలిపాడు. కానీ లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎందుకో డైరెక్టర్ మారుతి కి సంతృప్తి కలగలేదట. దీంతో ఆయన బాలీవుడ్ కి వెళ్లి సంజయ్ దత్ కి కథ వినిపించడం, ఆయనకు బాగా నచ్చి వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం జరిగింది.
ఈ పాత్ర చేయడం కోసం ఆయన దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసాడట. అంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఆయనతో చేయించాల్సిన అవసరం ఏంటి?, మన టాలీవుడ్ లో జగపతి బాబు లాంటి వాళ్లకు కూడా ఈ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది కదా, రెమ్యూనరేషన్ కూడా 15 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లోని ముసలి ప్రభాస్ సన్నివేశాలు లేవని అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. నేడు ఫస్ట్ షోస్ నుండి ఆ సన్నివేశాలను జత చేస్తున్నట్టు కాసేపటి క్రితమే సక్సెస్ మీట్ లో నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు.