Homeఎంటర్టైన్మెంట్Mohan Babu role in The Paradise: 'ది ప్యారడైజ్' చిత్రంలో మోహన్ బాబు పాత్రని...

Mohan Babu role in The Paradise: ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు పాత్రని మిస్ చేసుకున్న తమిళ స్టార్ హీరో అతనేనా?

Mohan Babu role in The Paradise: ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియన్ చిత్రాల్లో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie). వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆడియన్స్ లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న నాని(Natural Star Nani), ఈసారి తన ఇమేజ్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాలి అనే కసితో చేస్తున్న చిత్రమిది. సుమారుగా ఈ చిత్రం కోసం 250 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. రీసెంట్ గా మన స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇంత బడ్జెట్ అవ్వలేదు. నాని కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘దసరా’ చిత్రం తో ఇప్పటికే ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ఈసారి అంతకు మించిన థియేట్రికల్ అనుభూతిని అందించాలనే కసితో, ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయం లో కొత్తగా ఉండేలా చూసుకున్నాడు.

గ్లింప్స్ తోనే అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటాది, శ్రీకాంత్ ఓదెల ఏ రేంజ్ సినిమా తీస్తున్నాడు అనేది. నాని గెటప్ దగ్గర నుండి, ఈ చిత్రం లో నటించే ప్రతీ నటీనటుల గెటప్ చాలా కొత్తగా ఉండబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. ఇన్నేళ్ల తన సుదీర్ఘ సినీ ప్రస్థానం లో మోహన్ బాబు ఎప్పుడూ కూడా ఇలాంటి లుక్స్ లో కనిపించలేదు. సరైన పాత్ర తగిలితే చెలరేగిపోయే మోహన్ బాబు కి, నెవెర్ బిఫోర్ రేంజ్ క్యారెక్టర్ రాస్తే ఇక ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో మీరే ఊహించుకోండి. అయితే ఈ పాత్ర కోసం ముందుగా మోహన్ బాబు ని సంప్రదించలేదట.

తమిళం లో కొత్త తరహా పాత్రలను చేస్తూ వచ్చే విజయ్ సేతుపతిని ముందుగా సంప్రదించారట. ఆయన నటించడానికి ఆసక్తి అయితే చూపించాడట కానీ, డైరెక్టర్ వద్ద అప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ లేదు. విజయ్ సేతుపతి బౌండెడ్ స్క్రిప్ట్ చదవనిదే ఈ సినిమాకు కూడా సంతకం చేయడు. డైరెక్టర్ దగ్గర ఆ సమయం లో సిద్ధంగా లేకపోవడం రెడీ చేసుకొని రమ్మన్నాడట విజయ్ సేతుపతి. కానీ నాని కి మాత్రం ఈ పాత్రని మోహన్ బాబు గారితో చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ని డైరెక్టర్ ముందు పెట్టాడు. కొన్ని స్కెచులు వేసుకొని స్టోరీ బోర్డు లో చూసుకున్న తర్వాత మన సినిమాకు ఆయన మాత్రమే న్యాయం చేయగలడు అని నమ్మి, మోహన్ బాబు కి బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోయినా కూడా ఆయన క్యారెక్టర్ వరకు ఎలా ఉంటుందో వివరించడం, మోహన్ బాబు కి తెగ నచ్చడం తో వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం వంటివి జరిగాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version