Rajinikanth Movie: ఇండియా లో ఏ స్టార్ డైరెక్టర్ కి అయినా సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) తో సినిమా చేయడం ఒక డ్రీం. ఎందుకంటే ఆయన సినిమాలను సౌత్ లో చూస్తారు, నార్త్ లో చూస్తారు, ఓవర్సీస్ లో అయితే చెప్పనక్కర్లేదు, ఇప్పటికీ ఆ ఓవర్సీస్ మార్కెట్ లో రజినీకాంత్ ని మించిన సూపర్ స్టార్ లేరు. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో తో, పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ స్టేటస్ ఉన్న డైరెక్టర్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ వస్తాయి అనేది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఎవరికైనా రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోలేరు. కానీ ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం ‘ఆమ్మో..రజినీకాంత్ తోనా..? నా వల్ల కాదు’ అని పారిపోయాడట. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు, రాజమౌళి(SS Rajamouli).
మగధీర వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి కి రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం వచ్చిందట. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. అయితే రాజమౌళి ముందు ఈ సినిమా ప్రతిపాదన పెట్టగానే ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడట. అంత పెద్ద సూపర్ స్టార్ తో సినిమా చేస్తే అంచనాలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి, ఎంత బాగా తీసినా, ఇంకా బాగుండాల్సింది అని అనిపించే ప్రమాదం ఉంది. అందుకే ఈ సినిమా చేసే ధైర్యం లేదని రాజమౌళి నేరుగా సన్ పిక్చర్స్ కి చెప్పి తప్పించుకున్నాడట. ఆ తర్వాత ఆయన ఆడియన్స్ అంచనాల నుండి తప్పించుకోవడానికి ‘మర్యాద రామన్న’ లాంటి చిన్న సినిమా చేసాడు. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఈగ చిత్రాన్ని చేసాడు. ‘ఈగ’ చేసిన తర్వాత రాజమౌళి లో ఒక నమ్మకం అయితే ఏర్పడింది. రిస్క్ చేయడానికి సిద్దమైపోయాడు.
అలా అప్పట్లో భారీ బడ్జెట్ తో ‘బాహుబలి’ సిరీస్ ని తెరకెక్కించాలని అనుకున్నాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత ఆయన ఏకంగా రామ్ చరణ్,ఎన్టీఆర్ లాంటి నేటి తరం మాస్ స్టార్ హీరోలను పెట్టి #RRR వంటి చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒకప్పుడు రజినీకాంత్ సినిమానే భారంగా భావించిన రాజమౌళి,ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సమర్థవతంగా ఒక సినిమా తీయగలను అనే రేంజ్ కి తన మైండ్ సెట్ ని మార్చుకున్నాడు. ఒకప్పుడు రజినీకాంత్ ని రాజమౌళి కి హ్యాండిల్ చేయలేనేమో అని భయం ఉండేది కావొచ్చు కానీ, ఇప్పుడు ఎలాంటి భయం లేదని ఆయన లేటెస్ట్ సినిమాలను చూస్తేనే తెలుస్తోంది. కాబట్టి రజినీకాంత్ తో ఇప్పుడు సినిమా తీసే సత్తా రాజమౌళి కి ఉంది. కానీ ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ కారణంగా ఈ కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అవ్వకపోవచ్చు కానీ, ఆయన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం లో మాత్రం రజినీకాంత్ కి భీష్ముడు లేదా ద్రోణాచార్యుడి క్యారక్టర్ దొరికే అవకాశం ఉంది.