Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుండడంతో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల అయ్యాయి. అందులో ‘మీసాల పిల్ల’ పాట సెన్సేషనల్ హిట్ కాగా, ‘శశిరేఖ’ పాట యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం నుండి టీజర్, లేదా గ్లింప్స్ వీడియో కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే., ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని, కేవలం సంక్రాంతికి వచ్చే డబ్బుల కోసం, ఆడియన్స్ కి ఆ సమయం లో ఏమి కావాలో అవి పెట్టి, సినిమా మొత్తాన్ని చుట్టేసేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
ఇక ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 30 కోట్ల రూపాయిలు మాత్రమేనట. చిరంజీవి రెమ్యూనరేషన్ 75 కోట్లు, అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ పాతిక కోట్లు, విక్టరీ వెంకటేష్ కి 15 కోట్లు, నయనతార కి 10 కోట్లు, ఇలా కేవలం రెమ్యూనరేషన్స్ తోనే ఈ చిత్రం ఓవరాల్ బడ్జెట్ 200 కోట్ల రూపాయలకు పైగా అయ్యిందని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతలుగా సాహు, చిరంజీవి కూతురు సుష్మిత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అత్యధిక శాతం బడ్జెట్ సాహు నే పెట్టుకుంటున్నాడట. సుష్మిత భాగం కొంతనే అయినప్పటికీ, తన కూతురుని ఇండస్ట్రీ నిర్మాతగా నిలబెట్టడం కోసమే ఈ ప్రాజెక్ట్ ని మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. విడుదల సమయానికి బిజినెస్ డీల్స్ మొత్తం క్లోజ్ అయితే సుష్మిత వాటా 35 నుండి 40 కోట్ల రూపాయిల వరకు వస్తుందట. ఇలా మొదటి సినిమాతోనే తన కూతుర్ని టేబుల్ ప్రాఫిట్స్ తో ఇండస్ట్రీ లోకి లాంచ్ చెయ్యాలని చూస్తున్నాడు మెగాస్టార్.
ఇకపోతే ఈ సినిమాకాలు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యినట్టే అనుకోవచ్చు. రీసెంట్ గానే విక్టరీ వెంకటేష్ రోల్ కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారట. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు వేరే లెవెల్ లో ఉన్నాయని టాక్. అయితే ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని చెప్పారు కానీ, విడుదల తేదీని మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు చెప్పలేదు. జనవరి 12 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. వచ్చే వారం విడుదల తేదీ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ తో ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.