https://oktelugu.com/

చిన్మయి తల్లికాబోతుందా..?

  ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కువ రోజులు మూత పడడంతో నెట్టింట్లోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొందరు భామలు హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తుండగా.. మరికొందరు తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ చిన్మయికి చెందిన ఓ ఫొటో సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ అయింది. ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే చిన్మయికి పెళ్లయి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2021 / 03:33 PM IST
    Follow us on

     

    ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కువ రోజులు మూత పడడంతో నెట్టింట్లోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొందరు భామలు హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తుండగా.. మరికొందరు తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ చిన్మయికి చెందిన ఓ ఫొటో సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ అయింది. ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

    అయితే చిన్మయికి పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఆమె త్వరలో తల్లి కాబోతుందా..? అని కొందరు ట్యాగులు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే చిన్మయి తన కుటుంబ సభ్యుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ ఆమె కడుపు ఎత్తుగా ఉండడంతో ఆమె ప్రెగ్నెన్నీనా అని చర్చించుకుంటున్నారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టని చిన్మియి ఎక్కువగా డ్రెస్సుల్లో కనిపించేంది. కానీ ఈసారి సాంప్రదాయ చీరలో కనిపించేసరికి అందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

    సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లపై చిన్మయి స్పందించారు. నేను ప్రస్తుతం ప్రెగ్నేన్సీ ని కాదు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందువల్ల మడికట్టు చీర కట్టాల్సి వచ్చింది. అందువల్ల బేబీ బంప్ వచ్చిందని అన్నారు. అలా రావడం వల్ల అందరూ నేను తల్లిని కాబోతున్నట్లు అందరికీ అలా కనిపించిందిన రిప్లై ఇచ్చారు. ఇక తన పెళ్లినాటి ఫొటోలను చూసినా ఇలాగే కనిపిస్తానని చిన్మయి చెప్పుకొచ్చారు.