Balakrishna : సినిమా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో నందమూరి ఫ్యామిలీకి మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ని టాప్ లెవల్ కి తీసుకెళ్లిన హీరోల్లో నందమూరి తారక రామారావు గారు టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇక ఈయన తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని ముందుకు తీసుకెళ్ళాడు… అందుకే ఆయనను తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నాన్ని రోజులు గుర్తుంచుకుంటారు…
నందమూరి నట వారసుడు అయిన బాలయ్య బాబు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి విజయాలను సాధించాడు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ వచ్చాయి. ఇక ఇప్పటికి కూడా తనదైన రీతిలో తన స్టామినాలు చూపిస్తూ వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రీసెంట్ గా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆయన ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేస్తున్న డాకు మహారాజ్ సినిమాతో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే అఖండ 2 సినిమాతో మరోసారి బోయపాటి డైరెక్షన్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తన కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం పట్ల కొంతమంది నందమూరి అభిమానులు అసహనాన్ని అనే వ్యక్తం చేస్తున్నారు అంటు మోక్షజ్ఞ మొదటి సినిమాని బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తే మాస్ హీరోగా ఎదిగే అవకాశాలు ఉండేవి.
అలా కాకుండా ప్రశాంత్ నీల్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా చేయించడం వల్ల ఆయన ఆ సినిమాని ఎలా తీస్తాడనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక దాంతో పాటుగా బాలయ్య ఇమేజ్ ను మ్యాచ్ చేయగలిగే కథతో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ లో బాలయ్య రాంగ్ స్టెప్ వేస్తున్నాడు అంటు కొంతమంది సినీ విమర్శకులు కూడా బాలయ్య బాబుని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికే అక్కినేని వారసుల ఎంట్రీ విషయంలో నాగార్జున రాంగ్ స్టెప్ వేయడం వల్ల వాళ్ళ కెరియర్లు అటు ఇటు కాకుండా పోతున్నాయి. మరి బాలయ్య బాబు ఇదంతా చూసి కూడా ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడు. అనే అనుమానాలను నందమూరి అభిమానులు వెల్లబుచ్చుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞ స్టార్ హీరోగా మారితే చూడాలని నందమూరి అభిమానులతో పాటు టిడిపి కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే మోక్షజ్ఞ స్టార్ హీరోగా వెలుగొందుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక మొదటి సినిమా సూపర్ సక్సెస్ అయితే తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటాడు. లేకపోతే మాత్రం తర్వాత సినిమాలతో శకేస్ అవ్వడం చాలా కష్టం…