అనుపమ పరమేశ్వరన్ అనగానే పక్కింటి అమ్మాయిలా ఉంటుందనే కామెంట్స్ వినబడతాయి. పైగా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాకపోవడం కూడా ఈ బ్యూటీకి ఒక ప్రత్యేకతను తీసుకువచ్చింది. కానీ, అవకాశాలే రోజురోజుకూ రాకుండా పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుపమ ఒక క్రికెటర్ ని పెళ్లాడనుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అది అబద్ధం అని ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చినా పుకార్లు మాత్రం ఆగలేదు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే బుమ్రా.
Also Read: ప్రభాస్ బాడీపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్
అతనితో అనుపమ డేటింగ్ లో ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఆమె గురించి ఎన్ని పుకార్లు షికార్లు చేసినా ఇంకా చేస్తూనే ఉన్నా అందులో నిజానిజాలు మాత్రం ఇంతవరకూ తేలలేదు. ఐతే, తాజాగా బుమ్రా పెళ్లి ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అతను చేసుకోబోయే అమ్మాయి ఒక హీరోయిన్ అంటూ వార్తలు గుప్పుమనడంతో మరోసారి అందరి చూపు ‘అనుపమ’ పై పడింది. ఈ వార్త పై ఆమె మాత్రం ఇంకా స్పందించలేదు. మరి ఇందులో ఎంత నిజం ఉందో అనుపమకే తెలియాలి.
Also Read: చిరంజీవి రీమేక్ స్టారా..? సూపర్ హిట్లన్నీ అవేనా..?!
ఏది ఏమైనా ఈ కేరళ కుట్టికి, బుమ్రాకి అసలు ఎలా లింక్ కుదిరిందనేది ఇప్పటికే మిస్టరీనేనట. పైగా అనుపమ పెద్దగా యాడ్స్ కూడా చేసింది లేదు. అలాగే బుమ్రాతో ఆమె ఎన్నడూ ఏ యాడ్ చేయలేదు. మరి వీరిద్దరికి కనెక్షన్ ఎలా కుదిరిందో వారికే తెలియాలి. అన్నట్టు బుమ్రా సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ కూడా అనుపమనే. ఇక ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానం భవతి’, ‘హలొ గురు ప్రేమకోసమే’, ‘రాక్షసుడు’ సినిమాలతో టాలీవుడ్ లో మంచి హిట్స్ అందుకున్న అనుపమను, మొదటి నుండి ఆదరిస్తోంది తెలుగు ప్రేక్షుకులే. ప్రస్తతం అమ్మడు తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్