
Anil Ravipudi: నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మామూలు ఊపులో లేదు. వరుసగా ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టి తన సత్తా చాటుకొని కుర్ర హీరోలతో సమానం గా పోటీ పడుతున్నాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి తో సినిమా అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ని కచ్చితంగా ఆశిస్తారు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు. కానీ బాలయ్య తో ఆయన సరికొత్త ప్రయోగం చెయ్యబోతున్నాడు.
పూర్తిగా కమర్షియల్ పద్దతిలో కాకుండా తెలంగాణ పోరాట యోధుడిగా ఈ చిత్రం లో ఆయన కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కానీ బాలయ్య ని కొత్త గెటప్ లో విభిన్నంగా చూపించేలోపు ఫ్యాన్స్ కాస్త షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అనిల్ రావిపూడి తో సినిమా అనగానే అభిమానులు కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ రాబోతుంది, ఇలాంటి జానర్స్ బాలయ్య కెరీర్ లో ఒకటి రెండు తప్ప మరొక మూవీ లేదు. ఇప్పుడు ఆ యాంగిల్ లో కూడా సక్సెస్ కొడుతాడు మా బాలయ్య అంటూ చెప్పుకొని తిరిగేవాళ్లు నందమూరి ఫ్యాన్స్.
కానీ అనిల్ రావిపూడి తన స్టైల్ ని పూర్తిగా పక్కన పెట్టి బాలయ్య స్టైల్ లోకి దిగడం వల్లే అభిమానులను టెన్షన్ పెడుతున్న విషయం.ఎందుకంటే ఇండస్ట్రీ లో బోయపాటి శ్రీను తప్ప ఎవ్వరు బాలయ్య ని ఆయన స్టైల్ లో హ్యాండిల్ చెయ్యలేరు. ఓవర్ మాస్ అయ్యి ఫలితాలు తేడా అవుతుంటాయి. ఉదాహరణకి రీసెంట్ గా విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం.

ఇందులో బాలయ్య ని బోయపాటి శ్రీను లాగ పూర్తి స్థాయిలో వాడుకొని ఉండుంటే వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసేదని ఫ్యాన్స్ అభిప్రాయం. అందుకే డైరెక్టర్స్ వాళ్ళ స్టైల్ ని ఫాలో అవుతూ బాలయ్య తో సినిమాలు చెయ్యాలి. అంతే కానీ బాలయ్య స్టైల్ లోకి వాళ్ళు దిగితే మాత్రం ప్రయోగం చేస్తున్నట్టే లెక్క.మరి అనిల్ రావిపూడి ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కి కూతురుగా నటిస్తుంది.