https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కి ఆ డైరెక్టర్ అంటే అంత భయమా… ఇంట్రెస్టింగ్ మేటర్ వెలుగులోకి!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ హీరోగా లాంచ్ అవ్వకముందు ఓ మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట. ఒక స్టార్ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ గా చేరాడట.

Written By: , Updated On : April 24, 2024 / 01:34 PM IST
Allu Arjun so afraid of that director

Allu Arjun so afraid of that director

Follow us on

Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ పుష్పకు కొనసాగింపుగా వస్తుంది. అల్లు అర్జున్ మరోసారి పుష్పరాజ్ గా సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అల్లు అర్జున్ బర్త్ డే కానుగగా విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ 110 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఇప్పటికే ఈ మూవీ హిందీ థియేట్రికల్ రైట్స్, ఓటిటీ రైట్స్ భారీ మొత్తంలో అమ్ముడుపోయానని సమాచారం. టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు బన్నీ. పుష్ప 2 ఆయన ఇమేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ హీరోగా లాంచ్ అవ్వకముందు ఓ మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట. ఒక స్టార్ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ గా చేరాడట. అయితే ఆ దర్శకుడంటే అల్లు అర్జున్ కి చాలా భయమట. ఆ డైరెక్టర్ ఎవరో చూద్దాం. వేణు, శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా పెళ్ళాం ఊరెళితే. ఈ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ మూవీకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఆ మూవీ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు.

అల్లు అరవింద్ మాట ప్రకారం బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈ సినిమాకు పని చేశారట. కాగా అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డి అంటే బన్నీ కి బాగా భయం ఉండేదట. గతంలో ఓ ఇంటర్వ్యూ లో ఎస్వీ కృష్ణారెడ్డి ఈ విషయం స్వయంగా బయట పెట్టారు. ఆయన దగ్గర భయపడుతూ బన్నీ పని చేసేవాడట. కాగా అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఒకే ఒక్క మూవీ ఇదే కావడం విశేషం.