Yashoda Collections: సమంత బ్రాండ్ ఇమేజి ముందు అక్కినేని హీరోల మార్కెట్ పనికిరాదా..? సమంత అక్కినేని హీరోలకంటే పెద్ద స్టారా?..రీసెంట్ గా విడుదలైన అక్కినేని హీరోల సినిమాలను మరియు సమంత నటించిన లేటెస్ట్ చిత్రం యశోద మూవీ కలెక్షన్స్ ని పరిశీలిస్తే అది నిజమేనేమో అని అనిపిస్తుంది..అక్కినేని నాగార్జున హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ఘోస్ట్ దసరా కానుకగా విడుదలై కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా మిగిలిన సంగతి మన అందరికి తెలిసిందే..పండగ రోజు కూడా ఈ చిత్రం సరైన వసూళ్లను రాబట్టలేకపోయింది అంటే అక్కినేని ఫామిలీ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ స్థాయి లో పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..క్లోసింగ్ లో ఈ సినిమా కనీసం 6 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేక్కపోయింది.

నాగార్జున గారి సినిమా అంటే ఆయనకీ వయసు అయ్యిపోయింది..నాన్ కమర్షియల్ సినిమాకి అంతకు మించి రాదులే అనుకోవచ్చు..కానీ మజిలీ, వెంకీ మామ , లవ్ స్టోరీ మరియు బంగార్రాజు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత కూడా నాగార్జున గారి తనయుడు నాగచైతన్య హీరో గా నటించిన ‘థాంక్యూ’ మూవీ కలెక్షన్స్ అతి దారుణంగా వచ్చాయి.
‘మనం’ మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి కేవలం మూడు కోట్ల రూపాయిల క్లోసింగ్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి..ఇక సమంత నటించిన యశోద మూవీ కలెక్షన్స్ ని తీసుకుంటే మొదటి రోజు ‘థాంక్యూ’ మూవీ కలెక్షన్స్ ని..రెండు రోజులకు ‘ది ఘోస్ట్’ మూవీ వసూళ్లను దాటేసింది..మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా మూడు కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టిన యశోద చిత్రం.

రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లు చేసి,కేవలం రెండు రోజుల్లోనే 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి అక్కినేని హీరోల లేటెస్ట్ చిత్రాల క్లోసింగ్ కలెక్షన్స్ ని దాటేసింది..దీనిని బట్టి చూస్తుంటే సమంత బ్రాండ్ ఇమేజి తన మాజీ భర్త నాగ చైతన్య మరియు మాజీ మామయ్య నాగార్జున బాక్స్ ఆఫీస్ మార్కెట్ కంటే చాలా రెట్లు ఎక్కువ అని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.