Aishwarya Rai Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), కొంత కాలం విశ్రాంతి తీసుకొని డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేయబోతున్నాడు. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరు కలిసి పని చేయబోతున్నారు అనే వార్త బయటకు రాగానే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. ఈసారి డైరెక్టర్ బాబీ మెగాస్టార్ ని గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నాడు. ఆయనతో ఒక పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించబోతున్నాడని టాక్. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan) నటించబోతున్నట్టు టాక్. ఇప్పటి వరకు చిరంజీవి, ఐశ్వర్య కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా తీయాలని కొంతమంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేశారు, కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ కుదిరింది. అయితే బాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ భారీ గా రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాయ్ కూడా అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుందని సమాచారం. దాదాపుగా 18 కోట్ల రూపాయలకు పైగా ఆమె రెమ్యూనరేషన్ అడుగుతుంది అట . అంతే కాకుండా ఆమె హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు ఆమె ఉండే హోటల్ కి, ఆమె స్టాఫ్ కి అయ్యే ఖర్చు కి డబ్బులు నిర్మాతలే కట్టాలట.
వీటికి నిర్మాత ఓకే చెప్పిన తర్వాతనే ఆమె ఈ చిత్రం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. ఇకపోతే ఐశ్వర్య రాయ్ చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో జీవించేసింది ఐశ్వర్య రాయ్. ఈ చిత్రం తర్వాత మళ్లీ ఆమె ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదు. ఇప్పుడు చిరంజీవి సినిమాకు కమిట్ అవుతుందో లేదో చూడాలి . ఒకవేళ ఐశ్వర్య ఈ సినిమాని ఒప్పుకొని చేస్తే, ఇదే ఆమె మొట్టమొదటి తెలుగు సినిమా అనొచ్చు. గతం లో అక్కినేని నాగార్జున తో కలిసి కేవలం ఒక ఐటెం సాంగ్ లో మాత్రమే కనిపించింది. అంతే కానీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఆమె పూర్తి స్థాయి సినిమా చేయలేదు.